
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

BIG Debate: విద్యార్థులపై పోలీసుల దాడికి కేంద్రం జవాబు చెప్పాల్సిందే: సీపీఎం నేత బాబురావు BIG Debate: ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడులకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, దీనికి పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సిందేనని సీపీఎం సీనియర్ నాయకుడు బాబురావు స్పష్టం చేశారు. 'hmtv' నిర్వహించిన బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేంద్రంలోని బిజెపి-ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సభకు రాకపోవడం బాధాకరమని బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు మాత్రమే కాకుండా, దేశ ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉందన్నారు. స్పీకర్‌కు లేఖలు రాస్తూ చర్చల నుంచి తప్పించుకునేందుకు యత్నించడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను

రాజ్యసభలో దుస్తుల ప్రస్తావన రాజకీయ దుమారానికి దారితీసింది. చర్చ సందర్భంగా తనను 'లంగీవాలా' అని పిలిచారంటూ సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఢిల్లీ, ఆగస్టు 12: రాజ్యసభలో దుస్తుల ప్రస్తావన తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. చర్చ సందర్భంగా తనను 'లంగీవాలా' (Lungiwala) అని పిలిచారంటూ సీపీఎం (CPM) ఎంపీ జాన్ బ్రిట్టాస్, బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు (Privilege Motion) ఇవ్వడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్షాలు దీనిని దక్షిణాది సంస్కృతిపై జరిగిన దాడిగా అభివర్ణించగా, ఆ ఆరోపణలను సుస్మితా దేవ్ ఖండించారు. సోమవారం సభలో ఇన్కమ్ టాక్స్ సవరణ ఆర్డినెన్స్‌పై తీర్మానం ప్రవేశపెడుతున్న సమయంలో తన వెనుక సీటులోకి వచ్చిన సుస్మితా దేవ్, తనను పదే పదే 'లంగీవాలా' అని పిలిచారని జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు. 'నేను ధోతీ ధరించాను. మలయాళీగా, దక్షిణాది భారతీయుడిగా నేను గర్విస్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు భారతీయ సంస్కృతిని, ప్రాంతీయ గుర్తింపును హేళన చేయడమే' అని బ్రిట్టాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై సుస్మితా దేవ్ స్పందిస్తూ తాను 'లంగీవాలా' అనే పదాన్ని వాడలేదని, ఏ రాష్ట్ర సంస్కృతినీ లేదా దుస్తులను అవమానించలేదని స్పష్టం చేశారు. 'నేను అస్సాంకు చెందిన బెంగాలీని. దేశంలో విభిన్న సంస్కృతులు, దుస్తులు ఉన్నాయనే విషయం నాకు తెలుసు' అని చెప్పారు. సభలో జాన్ బ్రిట్టాస్ అబద్ధాలు చెప్పారని, ఆయనపై కూడా తాను సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనను ఆప్, కాంగ్రెస్, సీపీఐ తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తీవ్రంగా ఖండించారు. భారత్‌లోని 'భిన్నత్వంలో ఏకత్వం'పై, దక్షిణాది సంస్కృతిపై జరిగిన దాడిగా దీనిని అభివర్ణించారు. పరిస్థితిపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ... ప్రభుత్వం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించదని
పార్లమెంట్లో ‘లుంగీవాలా వ్యాఖ్యలు’ తీవ్ర కలకలం రేపుతున్నాయి. సీపీఐ (ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ తనను బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ ‘లుంగీవాలా’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యసభలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టిన జాన్ బ్రిట్టాస్.. దక్షిణాది వ్యక్తిగా తన ఆహార్యం తనకు ఎంతో గర్వకారణమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు వేదికగా ఓ ప్రాంతాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమమని అన్నారు.తాను ఓ రోజు సభలో మాట్లాడుతుంటే లుంగీవాలా అంటూ నన్ను ఉద్దేశించి అమర్యాదకర వ్యాఖ్యలు చేశారని రాజ్యసభ ఎంపీ పేర్కొన్నారు. ‘‘నేను ధోతీలో ఉన్నా. మలయాళీని, దక్షిణాది వ్యక్తిని అయినందుకు గర్వపడుతున్నాను.. కానీ, తమ సంస్కృతి పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంపై సభ దృష్టి సారించాలి. ఆమెకు వ్యతిరేకంగా ప్రివిలెజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాను.. ఆమెపై నాకు ఎటువంటి ద్వేషం లేదు’ అని ఎంపీ బ్రిట్టాస్ తెలిపారు. అయితే, తన బాధ్యతలు నిర్వర్తించనీయకుండా బీజేపీ ఎంపీ పదే పదే అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. పలుసార్లు ‘లుంగీవాలా’ అని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు.దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ సభాపక్ష నేత జేపీ నడ్డా స్పందిస్తూ.. లుంగీ కామెంట్స్‌ను తాము సమర్థించమని స్పష్టం చేశారు. బ్రిట్టాస్ అభ్యంతరాలు, తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలు అన్నీ రికార్డుల్లోకి చేరాయని ఆయన అన్నారు. సుస్మితా దేవ్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, అది తమ దృష్టిలో ధోతీ అని తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. సభ హుందాతనాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘సభకు సభ్యులందరూ సమానమే.. ఒక సభ్యుడిపై ఆరోపణలు వచ్చాయి.. కాబట్టి వారికీ తమ వివరణ ఇచ్చేందుకూ అవకాశం ఇస్తున్నాం.. సభా గౌరవానికి భంగం కలిగించేది ఏదైనా జరిగితే ఛైర్మన్ వారిని తన ఛాంబర్‌కు పిలిపించి వాదనలు

– ఈ నెల 31న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సీపీఎం మహాధర్నా – సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ భువనగిరి అర్బన్, ఆగస్టు 11 : జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వీడి నిధులు విడుదల చేయాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కీలక ప్రాజెక్టులుగా ఉన్న బస్వాపురం, గంధమల్ల ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు, నవాబ్ పేట రిజర్వాయర్ ప్రాజెక్టు, చిన్న నీటి పారుదల కాలువలైన ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునాదిగాని, ఆసిఫ్ నగర్ కాలువ పునరుద్దరణ పనులు పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29, 30, 31 తేదీలలో సీపీఎం చలో హైదరాబాద్ పేరిట రైతులు, నిర్వాసితులు, ప్రజలతో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి పాదయాత్ర ప్రారంభమై 31న హైదరాబాద్ ఇందిరా ధర్నా చౌక్ కు చేరుకుంటుందన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే మహా ధర్నాలో రైతులు, వ్యవసాయ కార్మికులు, నిర్వాసితులు, వృత్తి దారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 90 శాతం పూర్తయిన బస్వాపురం ప్రాజెక్టుకు మిగతా నిధులు ఇవ్వడంలో జాప్యంపై వివరణ ఇవ్వాలన్నారు. సుమారు రూ.420 కోట్లకు పైచిలుకు డబ్బులు నిర్వాసితులకు చెల్లించవలసి ఉందన్నారు. రూ.80 కోట్లు మంజూరు చేసినట్లు చెబుతున్న ఫైనాన్స్ కమిటీ వద్ద సంవత్సరం నుండి నిధులు నిలిచిపోయని అన్నారు. భూ నిర్వాసితుల రైతుల ఖాతాలో నిధులు జమ చేయాలన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా రాచకొండ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి రిజర్వాయర్ ద్వారా నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల గ్రామాలకు గ్రావిటీ ద్వారా సాగు నీరు అందించాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా

Nellore: దాచూరు దళితులకు సాగు భూములు కేటాయించాలి: సీపీఎం డిమాండ్! ఈ వార్తకు సంబంధించిన

– సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రేపాకుల శ్రీనివాస్ బూర్గంపహాడ్, ఆగస్టు 08 : మతోన్మాదుల నుండి దేశాన్ని కాపాడుకుందామని సీపీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు రేపాకుల శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురంలో సీపీఎం మండల స్థాయి రాజకీయ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై సీనియర్ నాయకుడు ఎస్కే జానిమియాతో కలిసి జెండా ఆవిష్కరించారు. మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రేపాకుల మతోన్మాదంను ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై బోధించారు. దేశం విభిన్న సంస్కృతులకు నిలయమని, అన్నిరకాల సంస్కృతులు కలగలిపిన దేశాన్ని పాలించడం కోసం భారత రాజ్యాంగం అనేక హక్కులు కల్పించిందన్నారు. నేటి పాలకులు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతులు అవలంభిస్తుందని, బీజేపీ దేశ లౌకిక విధానానికి తిలోదకాలిచ్చిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లయినా జీరో అకౌంట్ జీరోలోనే ఉందని, ఏడాదికి కోటి ఉద్యోగాల ఊసే లేదని ఫలితంగా దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందన్నారు. ఉక్కు క్రమశిక్షణ కలిగిన సీపీఎం పార్టీని గ్రామ గ్రామాన పటిష్టంగా నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాల నర్సారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలన్నారు. నీతి, నిజాయితీతో ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సీపీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు గడ్డం స్వామి, మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, పాండవుల రామనాథం, ఎస్కో.అబీద, పాపినేని సరోజిని, రాయల వెంకటేశ్వర్లు, కనకం వెంకటేశ్వర్లు, గుంటక కృష్ణ, సయ్యద్ హుస్సేన్, కమటం మరియమ్మ, మడకం లత, టేకులచెరువు సర్పంచ్ బోళ్ల సైదమ్మ పాల్గొన్నారు