
గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్
ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా, డైట్ చేసేవాళ్లు డిన్నర్ లో చపాతీలు తింటుంటారు. చపాతీలు పొంగితే మెత్తగా ఉంటాయి. తినడానికి ఈజీగా ఉంటుంది. కానీ చపాతీలు ఎప్పుడూ ఇలాగే పొంగవు. పిండి సరిగ్గా కలపకపోయినా, పిండి బాగాలేకపోయినా చపాతీలు అప్పడాల్లా అయిపోతాయి. అందుకే చపాతీలు సరిగ్గా పొంగాలని, బాగా కాలాలని కొందరు నేరుగా గ్యాస్ మంటపై పెట్టి కాలుస్తారు. కానీ ఇలా చేయడం చాలా తప్పు. నేరుగా గ్యాస్‌పై కాల్చిన చపాతీలు తినడం వల్ల శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. ఈ విషయాన్ని 'జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ'లో ప్రచురించిన ఓ పరిశోధన వెల్లడించింది. గ్యాస్ స్టవ్‌లు, గ్యాస్ గ్రిల్స్ మండేటప్పుడు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులను విడుదల చేస్తాయి. ఇవి శరీరానికి చాలా ప్రమాదకరం. మరో అధ్యయనం ప్రకారం, ఆహారాన్ని అధిక ఉష్ణోగ్రతలో వండినప్పుడు 'కార్సినోజెన్స్' అనే క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయి. ఇవి శరీరానికి అస్సలు మంచివి కావు. చపాతీలను ఇలా నేరుగా మంటపై కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు కూడా రావొచ్చు. Oil Free Poori: ఈ పూరీలను డైట్ చేసే వాళ్లు కూడా హాయిగా తినొచ్చు Eggs: కోడి గుడ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే Dosa: నీర్ దోశలు మెత్తగా రావాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు Cumin Water: పరగడుపున జీలకర్ర నీళ్లు తాగితే ఏమౌతుంది?