
వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగస్టు రోజు అస లేం జరిగింది
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపించారు. అయితే సాధారణంగా వినిపించే తొలి భాగంతో ఆపకుండా గీతాన్ని పూర్తి రూపంలో ఆలపించడం ఈసారి ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. గీతం కొనసాగుతున్న సమయంలో సోనియా గాంధీ ఖర్గే వైపు చూస్తూ కొన్ని సంజ్ఞలు చేయడం వీడియోలో కనిపించింది. దీంతో సోనియా గాంధీ ‘వందేమాతరం’ ఆలాపనను ఆపాలని సూచించారని పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. బీజేపీ సైతం కాంగ్రెస్ పార్టీపై అటాక్ చేయడం మొదలు పెట్టింది. ఈ ఆరోపణలతో వివాదం ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది. వీడియోను ఆధారంగా చేసుకున్న బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘వందేమాతరం’ దేశ స్వాతంత్ర పోరాటంతో ముడిపడిన జాతీయ గీతం కావడంతో దాన్ని పూర్తిగా ఆలపించడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం దేశభక్తి భావాలను దెబ్బతీయడమేనని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సోనియా గాంధీ పూర్తి ‘వందేమాతరం’ ఆలాపనను ఆపాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ జాతీయ గేయాన్ని అవమానించిందని విమర్శిస్తూ.. ఇందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఈ విషయాన్ని క్షమించరని అన్నారు. బీజేపీకి చెందిన పలువురు ఇతర నేతలు కూడా ఇదే అంశంపై కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. పార్టీ నేతలు, ఎంపీలు సోనియా గాంధీ తీరును ప్రశ్నించారు. ఈ వివాదంపై పశ్చిమ బెంగాల్‌లోని నైహాటి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుమిత్రో ఛటర్జీ కూడా స్పందించారు. ‘వందేమాతరం’ రచయిత బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ కుటుంబ వారసుడిగా తనకు ఈ పరిణామం మరింత బాధ కలిగించిందని పేర్కొన్నారు. సోనియా గాంధీకి రాసిన లేఖలో ఆయన కాంగ్రెస్ నాయకత్వాన్ని