
కడప ఎన్జీవో కాలనీ గణపతి విగ్రహం ప్రత్యేకతలు ఇవే
కడప జిల్లావ్యాప్తంగా విభిన్న రీతిలో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించారు. గత 50 ఏళ్లుగా వినాయకుడి ప్రతిమలు ఏర్పాటు చేశారు.

కడప జిల్లావ్యాప్తంగా విభిన్న రీతిలో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించారు. గత 50 ఏళ్లుగా వినాయకుడి ప్రతిమలు ఏర్పాటు చేశారు.

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు! Hyderabad: మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ గారు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత అని కొనియాడారు.. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేసి వ్యవసాయ రంగానికి వైఎస్సార్ గారు కొత్త ఊపిరి పోశారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.. వైద్య, ఇంజనీరింగ్ విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు చేరువ చేసి, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప దార్శనికుడు వైఎస్సార్ గారు అని అన్నారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు అండగా నిలిచి వారి జీవితాల్లో భరోసా నింపిన మహానేత అని కొనియాడారు

Paderu: అల్లూరి జిల్లాలో 87.71% పెన్షన్ల పంపిణీ పూర్తి: కలెక్టర్ నిశాంతి! ఈ వార్తకు సంబంధించిన

Visakhapatnam: విశాఖ ఉక్కు భూముల వేలం.. 19.29 ఎకరాల విక్రయానికి సిద్దం! ఈ వార్తకు సంబంధించిన

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Jagtial Ministers Meeting: పేదలకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వం... వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఊహించని స్థాయిలో వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రుల పర్యటన సందర్భంగా.. స్థానిక నూకపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర దుమారానికి దారి తీసేలా చేస్తోంది.. మంత్రుల సభకు జనాన్ని సమీకరించేందుకు మున్సిపల్ యంత్రాంగం అనుసరించిన తీరు లబ్ధిదారులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో పాటు స్థానిక MLA డా. సంజయ్ కుమార్‌తో పాటు మేడిపల్లి సత్యంలు హాజరవుతున్న ఇందిరమ్మ లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమానికి రావాల్సిందిగా అధికారులు కాలనీవాసులను ఆహ్వానించారట.. అయితే, అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది ఒక్కో ఇంటికి ఒకే ఒక్క భోజన టోకెన్ ఇస్తూ.. వివిధ షరతులు విధించడంతో స్థానికులను ఆశ్చర్యానికి గురయ్యారట.. ఇంట్లో నలుగురైదుగురం ఉంటే.. ఒక్కరికే తిండి పెడతారా? మిగతా కుటుంబ సభ్యులు ఏం కావాలి?.. అంటూ నిరుపేద మహిళలు అధికారులను నిలదీసే ప్రయత్నం కూడా చేశారట.. కడుపు నింపే తిండి వద్ద కూడా ఇలాంటి లెక్కలు వేయడం పేదలను తీవ్రంగా అవమానించడమేనని.. స్థానికులు మండిపడుతున్నారు. సభ ప్రాంగణానికి తరలిరావాలని ఒత్తిడి చేసిన అధికారులు.. కాలనీ నుంచి అక్కడికి చేరుకోవడానికి కనీస రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.. నూకపల్లి కాలనీ నుంచి ప్రధాన పట్టణానికి చేరుకోవడానికి ఆటోలతో పాటు బస్సు సౌకర్యాలు లేక వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు కూడా

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు చిట్టిల పేరుతో మోసం చేశాడు. వైసీపీ నేతగా చలామణి అవుతున్న మండాది శ్రీనివాసరావు దంపతులు చీటిల ముసుగులో రూ.70 లక్షలు కాజేశారు. గుడివాడ, ఆగస్టు 21: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు చిట్టిల పేరుతో మోసం చేశాడు. గుడివాడ ఎన్టీఆర్ కాలనీకి చెందిన మండాది మహాలక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు చీటిల ముసుగులో రూ.70 లక్షలు కాజేశారు. గత 20 ఏళ్లుగా కాలనీలో మత్స్యకార కుటుంబాలకు చెందిన వారితో చీటీలు కట్టించారు. తమకు చెల్లించాల్సిన చీటీ పాటల నగదును చెల్లించకుండా ఎగవేస్తున్నారని గుడివాడ పోలీసులకు జులై 31న బాధితులు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వర్ధంతి.. పవన్ కల్యాణ్ ఘన నివాళులు.. ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కృష్ణాజిల్లా, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గత 20 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్న దంపతులు.. పేదలు కష్టపడి దాచుకున్న డబ్బులను ఎగ్గొట్టి ఇల్లు ఖాళీ చేసి పారిపోయేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారిని బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రోడ్డు పక్కన చేపలు అమ్ముకునే వారు, ఇళ్లలో పనిచేసే వారు, ఇతర రోజువారీ కూలీలు, పేద కుటుంబాలే ఈ చిట్టీలకు ప్రధానంగా డబ్బులు చెల్లించినట్లు బాధితులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తూ తమ నుంచి డబ్బులు వసూలు చేశారని, ఇప్పుడు చిట్టీ డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. చిట్టీ డబ్బులు అడిగిన సమయంలో నిర్వాహకుల కుటుంబ సభ్యులు తమతో గొడవకు దిగేవారని బాధితులు తెలిపారు. తమకు జరిగిన మోసంపై సుమారు 15 రోజుల క్రితమే గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో తాజాగా నిర్వాహకులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని అడ్డుకున్నామని బాధితులు తెలిపారు. తమ వద్ద నుంచి సేకరించిన చిట్టీ డబ్బులతో శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. చిట్టీల పేరుతో పేదల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించి మోసం చేశారనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని ‘నిబంధనల

Anantapur: పెళ్లైన నెల రోజులకే నవవధువును రోకలిబండతో మోది చంపిన భర్త Anantapur: అనంతపురంలో దారుణం వెలుగుచూసింది. పెళ్ళైన నెల రోజులకే నవవధువు దారుణ హత్యకు గురైంది. భర్తే కాలయముడై భార్య తలపై రోకలిబండతో మోది ప్రాణాలు తీసిన ఘటన అనంతపురంలోని ఎల్లమ్మ కాలనీలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు ప్రాంతానికి చెందిన శాంతి(26)కి, శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతుకుంట గ్రామానికి చెందిన మహేష్(33)కు నెల రోజుల క్రితం పెళ్లైంది. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన వీరికి పెద్దలు వివాహం జరిపించారు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన మహేష్, నెల రోజుల క్రితమే భార్య శాంతితో కలసి అనంతపురంలోని ఎల్లమ్మ కాలనీకి వచ్చి అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డిఎస్పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా, శాంతి రక్తం మడుగులో శవమై కనిపించింది. తలపై రోకలిబండతో బాది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణం రెండు రోజుల క్రితమే జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తగా పెళ్ళైన ఈ దంపతుల మధ్య ఏవైనా మనస్పర్థలు, వివాదాలు తలెత్తాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం నిందితుడు మహేష్ పరారీలో ఉన్నాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఒకటవ పట్టణ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు

జీవీఎంసీ పరిధిలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేసే టౌన్ సర్వీస్ రిజర్వాయర్‌ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సందర్శించారు. నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. విశాఖపట్నం, ఆగస్టు 12: జీవీఎంసీ పరిధిలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేసే టౌన్ సర్వీస్ రిజర్వాయర్‌ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఈరోజు(బుధవారం) సందర్శించారు. నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. ముడసర్లోవ రిజర్వాయర్‌తోపాటు ఇతర రిజర్వాయర్లలో నీటి శాతం తగ్గిందన్నారు. ఈ క్రమంలో ఏలేరు కాలువ ద్వారా నగరానికి నీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఆరిలోవ, కేఆర్ఎం కాలనీ, పోతిన మల్లయ్యపాలెం సహా ఆరు ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉందని కమిషనర్ అన్నారు. గత రెండు రోజులుగా ఆయా ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నీటి సరఫరా సమయాన్ని అరగంట నుంచి 45 నిమిషాలకు పెంచినట్లు చెప్పారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ఉచిత నీటి ట్యాంకర్లను కూడా సరఫరా చేస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్ దోమల నివారణకు పురుగుమందు పిచికారీ.. కాసేపటికే ఇద్దరి మృతి

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సినీ కార్మికుల పిల్లల కోసం త్వరలోనే కార్పొరేట్ స్థాయి పాఠశాలను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని కూడా ఎంపిక చేశామని ఆయన వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా నవీన్ యాదవ్ ఈ కీలక వివరాలను పంచుకున్నారు. ఇదిలా ఉండగా, 2025 అక్టోబర్‌లో జూబ్లీహిల్స్‌లో జరిగిన సినీ కార్మికుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక హామీలు ఇచ్చారు. కృష్ణానగర్ సమీపంలో 3 నుండి 4 ఎకరాల విస్తీర్ణంలో నర్సరీ నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యాసంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్మికుల కుటుంబాలకు ఆరోగ్య బీమా, గృహ వసతి మరియు వెల్ఫేర్ ఫండ్ వంటి పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో 2025 నవంబర్‌లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సినీ కార్మికులు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నవీన్ యాదవ్ కుటుంబానికి చిత్రపురి హౌసింగ్ సొసైటీ మరియు సినీ పరిశ్రమతో గత 40 ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ మాట్లాడుతూ ‘విశ్వనాథ్ & సన్స్’ దర్శకుడు వెంకీ అట్లూరి తమ కుటుంబ మిత్రుడని గుర్తు చేసుకున్నారు. వెంకీ తండ్రి అట్లూరి సుబ్బారావు రియల్టర్‌గా, నిర్మాతగా ఎంతో కృషి చేశారని కొనియాడారు. సినీ కార్మికులకు ఎలాంటి సహాయం కావలసి వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఫలితంగా ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలంలో త్వరలోనే స్కూల్ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. సూర్య, మమితా బైజు నటించిన ‘విశ్వనాథ్ &

బిగ్‌బాస్ విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఎంవీపీ కాలనీ పోలీసులను ఆశ్రయించింది. విశాఖపట్నం, ఆగస్టు11: బిగ్‌బాస్ విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఎంవీపీ కాలనీ పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు ఎంవీపీ కాలనీ పోలీసులు బదిలీ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్వారపు రాహుల్ రెడ్డిపై బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. వివాహం చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఆ ఫిర్యాదులో స్పష్టం చేశారు. అలాగే బెదిరింపులు, పరువు నష్టం, దొంగతనంతోపాటు తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ ఆ ఫిర్యాదులో యువతి పేర్కొంది. ఇక ఈ కేసులో ప్రముఖ అడ్వకేట్ గీతా ప్రసన్న చందన, ఆమె భర్త శివ నారాయణ, జర్నలిస్టులు నరేష్, ఉదయ్, సాయిరాంతోపాటు సువర్ణ, హరిణ్య రెడ్డి, కార్తీక్, కేఆర్ రెడ్డిలపై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు 2026 మార్చి 10వ తేదీన కేవలం రాహుల్ రెడ్డిపై మాత్రమే నగర పోలీస్ కమిషనర్‌కు యువతి ఫిర్యాదు చేసింది. దాదాపు మూడు నెలల తర్వాత జూన్ 11వ తేదీన మరో 11 మంది పేర్లను చేర్చుతూ రెండో ఫిర్యాదు యువతి ఇచ్చింది. దీనిపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ రెడ్డి నుంచి బాధితురాలు రూ. కోటి డిమాండ్ నెరవేరక పోవడంతోనే ఈ ఫిర్యాదు చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మూడు నెలల్లో నిందితుల సంఖ్య పెరగడంతోపాటు ప్రముఖుల పేర్లు వినిపించడంతో.. పోలీస్ వర్గాల్లో