
Rithu Chowdary : ఫ్యామిలీతో కలిసి రీతూ చౌదరి వినాయకచవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
నటి, బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి తన ఫ్యామిలీతో కలిసి వినాయకచవితి పూజలు నిర్వహించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

నటి, బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి తన ఫ్యామిలీతో కలిసి వినాయకచవితి పూజలు నిర్వహించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు వేడెక్కబోతున్నాయి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున ఈసారి అధ్యక్షుడిగా బండ్ల గణేశ్ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ పదవికి సి. కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు నిర్మాతల మండలిలో ఎన్నికల శంఖారావం మ్రోగింది. గత కొంతకాలంగా ఈ అసోసియేషన్ ఎన్నికలు జరపాలని పలువురు నిర్మాతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక నెరవేరబోతోంది. సెప్టెంబర్ 6న ఎన్నికలను నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజేతలను ప్రకటిస్తారు. అయితే ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఆగస్ట్ 17 నుంచి నిర్మాతల మండలి ఎన్నికలకు నామినేషన్స్ ను స్వీకరిస్తున్నారు. ఇది 24వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజులు విత్ డ్రాస్ కోసం గడువు ఇచ్చి, 28న తుది జాబితాను ప్రకటిస్తారు. వీరందరికీ సెప్టెంబర్ 6న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎన్నికలు జరుగుతాయి. ఇదే రోజు సాయంత్రానికి ఫలితాలను వెల్లడిస్తారు. తెలుగు నిర్మాతల మండలికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో పాటు చిన్న నిర్మాతలకు మధ్య హోరాహోరీ పోరు సాగుతూ ఉంటుంది. తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి ఈసారి అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ పదవికి సి. కళ్యాణ్ పోటీ పడుతున్నారు. సి. కళ్యాణ్ ప్యానల్ నుంచి కార్యదర్శులుగా తుమ్మలపల్లి ప్రసన్న కుమార్, వైవియస్ చౌదరి పోటీ చేస్తున్నారు. జాయింట్ సెక్రటరీస్ గా అమ్మిరాజు, రామసత్యనారాయణ బరిలో నిలుస్తున్నారు. ట్రెజరర్‌గా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు పోటీ చేస్తున్నారు. కాగా... యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కు చెందిన బండ్ల గణేశ్ ప్యానల్ నుంచి ఏ పదవికి ఎవరెవరు పోటీ చేస్తారనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా కలసి బండ్ల గణేశ్‌ను ఈసారి అధ్యక్ష పదవికి బరిలో దించడం

టాలీవుడ్ నటి అనిత చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చత్రపతి సినిమాలో సూరీడు అనే డైలాగ్ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన నటనా ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలు, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతున్న తీరును పంచుకున్నారు. ఆమె తన కెరీర్లో సపోర్టింగ్ పాత్రల నుండి తల్లి పాత్రల వరకు అనేక విభిన్న పాత్రలలో నటించి మెప్పించారు. ఉయ్యాల జంపాల, మెంటల్ మదిలో, నిర్మలా కాన్వెంట్, వరుడు వంటి సినిమాలలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. అయితే, కొన్ని అదృష్టాన్ని కోల్పోయిన సంఘటనలు కూడా ఆమె జీవితంలో ఉన్నాయి. కార్తికేయ 2 సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సమయంలో, రెండవ వేవ్ కారణంగా అది వాయిదా పడింది. ఆ తర్వాత ఆమె పాత్రనే తొలగించారని తెలిసింది. అలాగే బొమ్మరిల్లు సినిమాలో సురేఖ వాణి చేసిన పాత్రను చేయాలనుకున్నప్పటికీ, ఆమె అమెరికాలో చిక్కుకుపోవడం వల్ల ఆ అవకాశం చేజారింది. ఆ పాత్రకు సురేఖ వాణిని తానే సిఫార్సు చేశానని అనిత తెలిపారు. అనిత చౌదరి జీవితంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఆమె డిస్క్ విరిగిపోవడం, కాలర్ బోన్ విరగడం, మోకాళ్లకు గాయాలు కావడం వంటి బాధలను అనుభవించారు. ఒకానొక సందర్భంలో, ఆమెకు డిస్క్ సమస్య తీవ్రమై, కుడి చేయి , కుడి కాలు పని చేయడం మానేశాయి. ఆ సమయంలో ఆమెకు తక్షణ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. కానీ ఆమె అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని భావించారు. అప్పుడు ఆమె అభిమాని ద్వారా బాలకృష్ణ గారికి ఈ విషయం తెలిసింది. ఊహించని విధంగా బాలకృష్ణ గారు ఆసుపత్రికి వచ్చి, డాక్టర్లతో మాట్లాడారు. తమ ఆసుపత్రి నుండి న్యూరోసర్జన్లను పిలిపించి, అనిత బంధువులతో, ఆమె భర్తతో ఫోన్లో మాట్లాడి, సర్జరీ చేయించుకోవాల్సిన