
భారతీయులు అమెరికాలో ఇల్లు, భూమి లేదా కమర్షియల్ప్రాపర్టీ కొనుగోలు చేయవచ్చా..? చట్టాలు ఏం చెబుతున్నాయి
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. US Real Sstate Investment from india: భారతీయ పౌరులు అమెరికాలో నివసించకపోయినా అక్కడ ఇల్లు, భూమి లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి అమెరికన్ ఫెడరల్ చట్టాలు అనుమతి ఇస్తాయి. అలాగే మన భారతీయ చట్టాలు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు. అయితే కొన్ని పరిమితులకు లోబడి అమెరికాలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా భారతీయ పౌరులు అమెరికాలో ఇల్లు, అపార్ట్మెంట్, కమర్షియల్ భవనం లేదా భూమిని కొనుగోలు చేయడం అమెరికా ఫెడరల్ చట్టాలు అనుమతిస్తాయి. అమెరికాలో నివసించే వీసా లేకపోయినప్పటికీ, అంటే ఉదాహరణకు టూరిస్ట్ వీసా, వర్క్ వీసా, గ్రీన్ కార్డు లేకపోయినా ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇల్లు కొనుగోలు చేసినంత మాత్రాన ఆటోమేటిక్గా గ్రీన్ కార్డు లేదా పౌరసత్వం అనేది లభించదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రాపర్టీ యాజమాన్యం, అలాగే ఇమిగ్రేషన్ హక్కులు రెండు వేర్వేరు శాఖలకు చెందినవి. కనుక పౌరసత్వంతో ఆస్తి కొనుగోలుకు సంబంధం లేదు అని చెప్పవచ్చు. ఇక అమెరికాలో కేవలం ఇల్లు, భూములు మాత్రమే కాదు, కమర్షియల్ ప్రాపర్టీలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. షాపింగ్ స్పేస్, ఆఫీస్ భవనం, గోడౌన్స్ ఇలా అనేక ఆస్తుల్లో విదేశీయులు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. అలాగే అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ భూముల కొనుగోలు పైన కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే అవి స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఇక అమెరికాలో ఆస్తులను కొనుగోలు చేయడానికి అమెరికన్ బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం