
ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డ పుతిన్ సేన
అర్ధరాత్రి వేళ.. ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయం.. ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చెవులు బద్దలయ్యేలా ఎయిర్-రైడ్ సైరన్లు మోగాయి.. ఊహించని క్షణాల్లో ఆకాశం నుంచి డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై నిప్పుల వర్షం కురిపించాయి. గురువారం తెల్లవారుజామున రష్యా ఏకకాలంలో జరిపిన భారీ క్షిపణి, డ్రోన్ దాడులతో కీవ్ నగరం అతలాకుతలమైంది. నగరవ్యాప్తంగా శక్తివంతమైన పేలుళ్లు సంభవించగా, నివాస సముదాయాలు, హోటళ్లు అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. కీవ్ నగరంపై రష్యా మరో ఘోరమైన మాసివ్ స్ట్రైక్ (భారీ దాడి)కి ప్లాన్ చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దారుణం జరిగిపోయింది.క్షిపణుల వర్షం.. కూలిన అపార్ట్మెంట్లు!రష్యా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల ధాటికి కీవ్ నగర కేంద్రంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు (Air Defence) శత్రు క్షిపణులను అడ్డుకునేందుకు ఎదురుదాడికి దిగడంతో ఆకాశం యుద్ధభూమిని తలపించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సంభవించిన వరుస పేలుళ్లతో భూమి కంపించినట్లయింది.కీవ్ మేయర్ విటాలీ క్లిట్ష్కో తెలిపిన వివరాల ప్రకారం.. దాడి ధాటికి ఒక 9 అంతస్తుల భారీ నివాస భవనం (అపార్ట్మెంట్) పూర్తిగా కుప్పకూలిపోయింది. ఆ శిథిలాల కింద అనేకమంది పౌరులు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. మరో జిల్లాలో ఒక ప్రముఖ హోటల్ పైకప్పు పూర్తిగా తగలబడిపోయింది. ఈ దాడిలో ఐదుగురు వైద్య సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉక్రెయిన్ దెబ్బకు సర్వం కోల్పోతున్న రష్యా.. పుతిన్ సంచలన నిర్ణయంప్రాణాలు చేతబట్టుకుని సబ్వే స్టేషన్లకు..అధికారులు ముందే హై-అలర్ట్ ప్రకటించడంతో వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు తమ పెంపుడు జంతువులు, స్లీపింగ్ బ్యాగులను తీసుకుని భూగర్భ సబ్వే (మెట్రో) స్టేషన్లకు పరుగులు తీశారు. క్షిపణుల దాడి ముగిసేవరకు బంకర్లు, సురక్షిత ప్రాంతాల నుంచి బయటకు రావద్దని మేయర్ క్లిట్ష్కో ప్రజలను వేడుకున్నారు. రష్యా ఇంధన సరఫరా కేంద్రాలు










