
నెమార్ షో ముగిసె
గరించా, పీలే, జికో, రొమారియో, రివాల్డో, రొనాల్డిన్హో వారసుడిగా దాదాపుగా రెండు దశాబ్దాలపాటు బ్రెజిల్ ఫుట్‌బాల్‌కు వెన్నెముకగా నిలిచిన నెమార్ జూనియర్ తన ఆటను ముగించాడు. గరించా, పీలే, జికో, రొమారియో, రివాల్డో, రొనాల్డిన్హో వారసుడిగా దాదాపుగా రెండు దశాబ్దాలపాటు బ్రెజిల్ ఫుట్‌బాల్‌కు వెన్నెముకగా నిలిచిన నెమార్ జూనియర్ తన ఆటను ముగించాడు. ప్రీక్వార్టర్స్‌లో నార్వే చేతిలో పరాజయంతో తీవ్ర భావోద్వేగానికి గురైన 34 ఏళ్ల నెమార్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఎక్కడైతే అరంగేట్రం చేశాడో.. అక్కడే అంతులేని ఆవేదనతో కెరీర్‌ను ముగిస్తున్నట్టు వెల్లడించి అభిమానులను మరింత షాక్‌కు గురి చేశాడు. ప్రస్తుత ఫిఫా వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ తరఫున నెమార్ ఆడింది ఒక్క మ్యాచ్ మాత్రమే. గాయం కారణంగా అతను నార్వేతో మ్యాచ్ ముందు వరకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. నార్వేతో పోరులో కూడా ద్వితీయార్ధంలో బరిలోకి దిగి జట్టు సాధించిన ఏకైక గోల్‌ను పెనాల్టీ కిక్‌తో తానే అందించాడు. ఆ వెంటనే నార్వే గోల్ కీపర్ దగ్గరికి వెళ్లి ‘గుర్తుంచుకో.. నా పేరు నెమార్’ అంటూ గర్వంగా చెప్పడం కనిపించింది. అనంతరం అదే తన చివరి గోల్ అనే ఉద్దేశంతో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ ప్రేక్షకులకులకు అభివాదం చేశాడు. 2010లో 18 ఏళ్ల వయస్సులో ఇదే మెట్‌లైఫ్ మైదానంలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో నెమార్ అరంగేట్రం చేశాడు. ‘ఎంతో ప్రయత్నించా. కానీ ఇప్పుడు అంతా ముగిసి పోయింది. ఇక్కడే నా ప్రయాణం ఆరంభమైంది. ఇక్కడే ముగిసింది’ అంటూ నెమార్ తన ఆటకు వీడ్కోలు పలికాడు. ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత పటిష్టమైన జట్టుగా పేరు తెచ్చుకున్న బ్రెజిల్ ఆరో వరల్డ్‌కప్ కోసం తాజా టోర్నీలో బరిలోకి దిగింది. కానీ ఆరంభం నుంచి నెమార్ జట్టులో లేకపోవడంతో బలహీనంగా కనిపించింది. ఇక నార్వే సంచలన ప్రదర్శన ఆ జట్టు ఆశలను ఆవిరి చేసింది. నిజానికి నెమార్ కెరీర్లో గాయాలదే సింహభాగంగా చెప్పవచ్చు. ఇదే కారణంగా చాలాకాలం పాటు