
వరుస ఆఫర్స్.. దుమ్మురేపుతున్న భాగ్యశ్రీ బోర్సే
తెలుగు సినీ ప్రేక్షకులకు ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో పరిచయమైన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారుతోంది.bhagyashri borse getting back to back offers in telugu and tamil

తెలుగు సినీ ప్రేక్షకులకు ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో పరిచయమైన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారుతోంది.bhagyashri borse getting back to back offers in telugu and tamil

భాగ్యశ్రీ బోర్స్ ని చూస్తే చాలు 'అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా అని పాడని వాళ్ళు ఉండరు. అలాంటిది అభిమానుల గుండెలో ఎంతటి కవిత్వం తన్నుకొస్తూ ఉంటుందో చెప్పక్కర్లేదు. కళ్ళతోనే తన క్యారక్టర్ భావజాలం మొత్తాన్ని చెప్పేసే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా అఖిల్ అక్కినేని తో కలిసి 'లెనిన్' తో విజయాన్ని అందుకుంది. భాగ్యశ్రీకి తొలి విజయం కూడా.. లెనిన్ విజయం తర్వాత భాగ్యశ్రీ కి టాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ ఆలస్యానికి వెనుక ప్రధాన కారణం భాగ్యశ్రీ స్క్రిప్ట్ ఎంపికలో చూపిస్తున్న జాగ్రత్తలేనని, తొందరపడి సినిమాలు ఒప్పుకోవడం కంటే, బలమైన క్యారెక్టర్స్ ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోందట. ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న ప్రకరాం రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్స్ లో చరణ్ కి జోడిగా భాగ్యశ్రీ కనిపించబోతుందనే సమాచారం అయితే వినిపిస్తూనే ఉంది. అదే జరిగితే టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ పోస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఖాళీ లేనట్టే. విడదీయాలని చూస్తే రోడ్డుపైనే కొడతాం.. ఫిల్మ్ ఫెడరేషన్, రఘు వర్గానికి సుమలత వార్నింగ్.! సందీప్ సరోజ్, సాత్విక జంటగా ప్రారంభమైన ‘వేట’.!

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఓవర్ నైట్ బిజియెస్ట్ కంపోజర్‌గా మారాడు సాయి అభ్యంకర్. డైరీలో మైల్డ్ బ్లోయింగ్ ఆఫర్స్ ఉన్నా కూడా ఆల్బమ్స్ కంటిన్యూ చేస్తున్నాడు ఈ యంగ్ బాయ్. ఇండిపెండెంట్స్ సాంగ్స్ కోసం రైజింగ్ అండ్ యూత్‌లో అటెన్షన్ పే చేస్తున్న బ్యూటీల్నే గ్రాబ్ చేస్తుంటాడు. ముఖ్యంగా తమిళంలో క్లికైన భామలే అతడి టార్గెట్. ఆసా కూడాలో ప్రీతి ముకుందన్తో స్టెప్పులేయించిన సాయి.. ఆ తర్వాత సితిరి పుత్తిరిలో మీనాక్షి చౌదరిని పట్టుకొచ్చాడు. వీజీ వీకూరలో శాన్వీ మేఘనతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది పావళ మల్లి సాంగ్ కోసం టాలీవుడ్ అండ్ కోలీవుడ్ యూత్ క్రష్ కయాద్ లోహార్తో కలిసి మాస్ స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు సాయి అభ్యంకర్. తాజాగా మరో ఇండి ఆల్బమ్ రిలీజ్ చేశాడు నూనుగు మీసాల కుర్రాడు. ఈ సారి భాగ్యశ్రీ బోర్సేతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. రాధిమా బ్రేకప్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ ఆల్బమ్‌కు తన మాజీ ప్రేయసి పేరైన “రాధిమా” అని పేరు పెట్టాడట 21 ఏళ్ల యంగ్ బాయ్. పేరుకు బ్రేకప్ సాంగ్ కానీ చూసేందుకు రొమాంటిక్ సాంగ్‌ను తలపిస్తోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. డ్యూడ్, కరుప్పు చిత్రాలతోతో ఫ్రూవ్ చేసుకున్న 21 ఇయర్స్ యంగ్ కంపోజర్ సాయి ఖాతాలో దాదాపు పది సినిమాలున్నాయి. అందులో మోస్ట్ యాంటిసిపెటెడ్ ఫిల్మ్ ‘రాకా’ కూడా ఒకటి. ఫస్ట్ కమిటైన ఫిల్మ్ బెంచ్ ఇంకా రిలీజ్ కాకుండా బోలెడు ఆఫర్స్‌తో స్టార్ కంపోజర్స్‌కు స్ట్రాంగ్ కాంపిటీటర్ అవుతున్నాడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైవ్ కాన్సర్ట్స్ అని, మ్యూజిక్ ఈవెంట్స్ అంటూ ఫోకస్ పెడితే ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనే ఫేమ్ తెచ్చుకుంటున్నారు స్టార్ కిడ్. తన ఇండివిడ్యువల్స్ సాంగ్స్‌తో క్రేజీ హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని హీరో కావాలన్న కోరికను ఫిల్ చేసుకుంటున్నాడు హరిణీ అండ్ టిప్పుల ముద్దుల కిడ్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరియు వినోదాత్మక చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న శర్వానంద్, ఈ సారి శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ద్వారా శ్రీను వైట్ల మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వినోదంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శర్వానంద్ ఒక సరికొత్త గెటప్‌లో కనిపించనున్నట్లు సమాచారం. కథానాయికగా యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. శర్వానంద్-భాగ్యశ్రీల తాజా కాంబినేషన్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం సీనియర్ బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ను సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని, ఇది సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, ఎమోషన్స్‌తో పాటు పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్లు తోడవడంతో ఈ గ్లోబల్ టచ్ ఉన్న ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి

గత నెలలో థియేటర్లకు వచ్చిన అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘లెనిన్’ (Lenin,) సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి జీ5 ఓటీటీ (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లెనిన్’.. కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు మేకర్స్ తెలిపారు. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అఖిల్ నటనకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జీ5లో ‘లెనిన్’కు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఓటీటీలోనూ అదే జోరు.. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలోకి వచ్చింది. జీ5లో స్ట్రీమింగ్ మొదలైన రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్‌ను అందుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి ఇది నిదర్శనమని మేకర్స్ చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ‘లెనిన్’ ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో కథ.. చిత్తూరు జిల్లా రామచంద్రపురం గ్రామంలో జరిగే ద్రౌపదమ్మ తిరునాళ్ల నేపథ్యంలో ‘లెనిన్’ కథ సాగుతుంది. స్నేహం, ద్రోహం, కోపం, పగ, ప్రతీకారం వంటి అంశాలను కలిపి దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ కథను తెరకెక్కించారు. లెనిన్‌కు ప్రాణ స్నేహితుడే ఎందుకు ద్రోహం చేశాడు? ఆ ద్రోహం వల్ల లెనిన్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అసలు లెనిన్ జైలుకు ఎందుకు వెళ్లాడు? రామచంద్రపురంలో జరిగిన కురుక్షేత్రంలో చివరికి ఎవరు గెలిచారు? అనేది సినిమా

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కే ఈ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ యోధుడిగా కనిపించనున్నారు. 2027 మార్చి తర్వాతే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తో్న్న మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ నెల 20 నుంచి ‘గుంటూరు కారం’ సెట్లో ఓ మాస్ పాట చిత్రీకరించనున్నారు. ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి పాల్గొననున్నారు. నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మేకర్స్ చెప్పిన కథ నచ్చడంతో భాగ్యశ్రీ ఓకే చెప్పారని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘శ్రీనివాస మంగాపురం’ ఫెయిల్యూర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి స్వీకరించారు. ఈ సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనని చెబుతూ త్వరలోనే అందరికీ నచ్చే మంచి చిత్రంతో తిరిగొస్తానని చెప్పారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని.. ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిందన్నారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూడండి. అందుకే చెత్త సినిమాల్లో నటించా: సీనియర్ నటి ‘స్పిరిట్’ అద్భుతంగా వస్తోంది - సందీప్ రెడ్డి వంగా అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం బ్లడీ రోమియోపై ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగ్యశ్రీ భాగస్వామ్యంపై చిత్ర బృందం ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన లెనిన్ సినిమాతో భాగ్యశ్రీ తన గ్లామర్ మరియు నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె వైపు మొగ్గు చూపుతున్నారు. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామకు తాజాగా నాని సరసన నటించే భారీ అవకాశం దక్కింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇదిలా ఉండగా, బ్లడీ రోమియో కథాంశం గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. దర్శకుడు సుజీత్ తన మునుపటి చిత్రం ఓజీ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమా చిత్రీకరణను అక్టోబర్ నెల నుంచి ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ కీలక సన్నివేశాలను లండన్ నగరంలో చిత్రీకరించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో భాగ్యశ్రీ ప్రస్తుతం శివకార్తికేయన్‌తో కలిసి ఒక తమిళ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఇతర ప్రాజెక్టులతో చర్చలు జరుపుతున్నప్పటికీ, నాని సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే అధికారికంగా పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. నాని మరియు సుజీత్ కలయికలో రాబోతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు