
హేమమాలిని 'డ్రీమ్ గాళ్' ఇలా అయ్యింది
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ, ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలినిని అభిమానులు ప్రేమగా 'డ్రీమ్ గాళ్' అని పిలుచుకుంటారు. అయితే, ఆమెకు ఆ పేరు ఎలా స్థిరపడిపోయిందో చాలా మందికి తెలియదు. ఈ బిరుదు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను ఆమె 'ది కపిల్ శర్మ షో'లో పంచుకున్నారు. తన సినిమా కంటే ముందే తనకు ఆ పేరు ఎలా వచ్చిందో వివరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.హేమమాలిని హిందీలో అడుగుపెట్టిన తొలి చిత్రం 'సప్నో కా సౌదాగర్' (1968). ఈ సినిమా నిర్మాత బి. అనంతస్వామి ఓ అద్భుతమైన ప్రచార వ్యూహంతో ముందుకు వచ్చారు. సినిమా విడుదల కాకముందు, హీరోయిన్ ఎవరో చెప్పకుండా "డ్రీమ్ గాళ్ వస్తోంది" (Dream Girl coming to town) అంటూ ముంబై అంతటా పోస్టర్లు వేయించారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ డ్రీమ్ గాళ్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ విషయంపై హేమమాలిని మాట్లాడుతూ.. "నా తొలి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కానీ, పోస్టర్ల మీద ఎక్కడా నా పేరు కనిపించడం లేదు. అంతటా 'డ్రీమ్ గాళ్, డ్రీమ్ గాళ్' అనే కనిపిస్తోంది. వాళ్లేం చేస్తున్నారో అర్థం కాక నేను కాస్త ఆందోళన చెందాను. అప్పుడు నిర్మాత అనంతస్వామి గారు నాతో, 'నీ పేరును మేం ఇలాగే పరిచయం చేయబోతున్నాం. ఆ డ్రీమ్ గాళ్ ఎవరో కాదు, హేమమాలిని అని ఆ తర్వాత మేమే ప్రకటిస్తాం' అని చెప్పారు. ఆయన ఆలోచన అద్భుతంగా ఫలించింది. ఆ పేరు