
డ్రగ్స్ పై సీరియస్ వార్నింగ్.. ఈగిల్ ఫోర్స్’తో యాక్షన్‌ప్లాన్
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Anti Drug Campaign: చిన్నారుల భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు.. వాళ్ళు ఎంతగా వృద్ధిలోకి వస్తే, తెలంగాణ రాష్ట్రం అంతగా అభివృద్ధి చెందుతుందని అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, అక్రమ మానవ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తెలంగాణలో ఏ ఒక్కరూ మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర క్యాబినెట్ యావత్తు సంకల్పమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలకు గానీ, సరఫరా అనే మాటకే గానీ తావుండకూడదని తేల్చిచెప్పారు. ఆరోగ్యవంతమైన యువతను తయారుచేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నార్కోటిక్స్‌కు వ్యతిరేకంగా ప్రత్యేకంగా 'ఈగిల్ ఫోర్స్ అనే డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఈ విభాగం సంపూర్ణంగా పనిచేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు, రవాణా వాహనాలు సమకూర్చామన్నారు. ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ సమాజాన్ని కాపాడేందుకు పనిచేస్తున్న ఈ పోలీస్ ఉద్యోగ వ్యవస్థకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇచ్చే ప్రపోజల్‌ను ప్రభుత్వం తక్షణమే ఆమోదించి, వారిని ప్రోత్సహిస్తోందని అన్నారు. జీవితం చాలా విలువైనదని, ఉన్నత స్థానాలు సాధించి సమాజానికి మేలు చేయడానికే మనం జన్మించామని భట్టి విక్రమార్క అన్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని, వారి ఆశలను, ప్రభుత్వ ఆకాంక్షలను నిజం చేయడం కోసం ప్రతి ఒక్కరు 'సే నో టు డ్రగ్స్' అని గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం