
బాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదం.. నిద్రలోనే నటి అనన్య రాజ్ కన్నుమూత
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Bollywood actress ananya raj passes away: బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటి అనన్య రాజ్ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో అనన్య రాజ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించారు. నటి అనన్య జులై 15న తెల్లవారు జామున నిద్రలోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ వార్తని ఎంతో వేదనతో తెలియజేస్తున్నామన్నారు. గత ఏడాది కాలంగా అనన్య శారీరక, మానసిక సమస్యలతో పోరాడుతుందన్నారు. ఈ విషాద సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు అతిపిన్న వయసులో నటి అనన్య రాజ్ కన్నుమూయడం బాలీవుడ్ లో అందర్ని కలిచి వేసింది. నటి అనన్య అభిమానులు, నెటిజన్లు అనన్యకు నివాళులు అర్పిస్తున్నారు. అనన్య రాజ్ తెలుగులో.. తగ్గేదే లే మూవీలో హీరోయిన్ గా నటించారు. హిందిలో 2016 లో విడుదలైన 7 అవర్స్ టు గో, ఆ తర్వాత 2017 లో ది ఫైనల్ ఎగ్జిట్, 2019 లో ఘోస్ట్ పలు చిత్రాలలో నటించారు. 27 ఏళ్ల అతి పిన్న వయసునే హీరోయిన్ ఇక లేరనే విషాదకరమైన వార్త తెలిసి బాలీవుడ్ తో పాటు, టాలీవుడ్ సెలబ్రీటీలు అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee