పెళ్లి పీటలెక్కబోతున్న పెదకాపు’ బ్యూటీ.. ప్రియుడితోబ్రిగిడా సాగా ఎంగేజ్ మెంట్
కోలీవుడ్ నటి బ్రిగిడా సాగా జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ‘ఆహా కళ్యాణం’ వెబ్ సిరీస్‌లో ‘పవి టీచర్’ పాత్రతో యువత హృదయాలను కొల్లగొట్టిన ఈ డస్కీ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గత కొంతకాలంగా కోలీవుడ్ యువ నటుడు అనంత్ రామ్‌తో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన బ్రిగిడా.. తాజాగా నిశ్చితార్థ బంధంతో ఆ బంధాన్ని మరో మెట్టు ముందుకు తీసుకెళ్లింది. సోమవారం సాయంత్రం ఇరు కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక వైభవంగా జరిగింది.* సేమ్ టు సేమ్... ‘లెనిన్’ కలెక్షన్లు కూడా కాపీయేనా?... నాగవంశీని ఆడుకుంటోన్న నెటిజన్లు వెబ్ సిరీస్ నుంచి వెండితెర వరకుతమిళనాడుకు చెందిన బ్రిగిడా సాగా షార్ట్ ఫిల్మ్స్, డిజిటల్ సిరీస్‌ల ద్వారా కెరీర్‌ను ప్రారంభించి చాలా తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో వచ్చిన 'అయోగ్య' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. అలాగే రాధాకృష్ణ పార్థిబన్ ప్రయోగాత్మక చిత్రం ‘ఇరవిన్ నిళల్’, ‘గరుడన్’ వంటి విజయవంతమైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటిగా మంచి మార్కులు కొట్టేశారు. ఇక తెలుగు విషయానికి వస్తే.. 2023లో విడుదలైన విప్లవాత్మక చిత్రం ‘సింధూరం’ ద్వారా కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘పెదకాపు-1’ చిత్రంలోనూ నటించి తన సహజ నటనతో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు.* బాలయ్య ‘కృష్ణబాబు’ సీన్‌ని మక్కీకి మక్కీ దించేశారా?... ‘లెనిన్’ క్లైమాక్స్ సీన్‌పై నెట్టింట చర్చ సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్కొద్దిరోజుల క్రితమే అనంత్ రామ్ పుట్టినరోజు సందర్భంగా తమ ప్రేమ విషయాన్ని ప్రకటించిన ఈ జంట ఇప్పుడు నిశ్చితార్థం ముగించుకుని అభిమానులకు అసలైన సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో బ్రిగిడా – అనంత్ మెరిసిపోయారు. తమ జీవితంలోని ఈ మధుర