ఫోరెన్సిక్ రిపోర్టునే ఫోర్జరీ చేశారు.. సీఎం భగవంత్ మాన్ ను వెంటనే అరెస్ట్ చేయండి
Bhagwant Mann Forged Report Case : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చుట్టూ రాజకీయ, చట్టపరమైన ఉచ్చు రోజురోజుకూ బిగుస్తోంది. సిక్కుల అత్యున్నత ధార్మిక సంస్థ ‘అకాల్ తఖ్త్’ ఆయనను సిక్కు వ్యతిరేకిగా ప్రకటిస్తూ కఠినమైన తీర్పునిచ్చిన వివాదం ముగియకముందే.. పంజాబ్ ప్రభుత్వాన్ని కుదిపేసే మరో సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. సీఎం భగవంత్ మాన్‌ను కాపాడేందుకు పంజాబ్ ప్రభుత్వ పెద్దలు ఏకంగా ఒక నకిలీ ఫోరెన్సిక్ నివేదికను సృష్టించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో హర్యానాలోని గురుగ్రామ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో.. రంగంలోకి దిగిన బీజేపీ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తక్షణమే రాజీనామా చేయాలని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని సంచలనమైన డిమాండ్‌ను లేవనెత్తింది.అసలు వివాదం ఏమిటంటే..?కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో సీఎం భగవంత్ మాన్ సిక్కు గురువుల చిత్రపటాలపై మద్యం చిలకరిస్తున్నట్లు ఉన్న విజువల్స్ సిక్కు సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన అకాల్ తఖ్త్.. గత వారం భగవంత్ మాన్‌ను దోషిగా తేల్చింది. అయితే ఈ ఆరోపణలను తిప్పికొట్టడానికి మాన్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెండు ప్రముఖ ఫోరెన్సిక్ ల్యాబ్‌ల విశ్లేషణ ఆధారంగా రూపొందించిన నివేదికను విడుదల చేస్తూ.. ఆ వీడియోలో ఉన్నది ముఖ్యమంత్రి కాదని, అది మార్ఫింగ్ చేసిన నకిలీ వీడియో అని క్లీన్ చిట్ ఇచ్చుకుంది.గురుగ్రామ్ హోటల్లో డీల్.. రూ. 10 లక్షల ఆఫర్!ఈ ఫోరెన్సిక్ నివేదిక వెనుక పెద్ద కుట్ర దాగుందంటూ గురుగ్రామ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒక ప్రముఖ సైబర్ నిపుణుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఢిల్లీకి చెందిన అంకిత్, పంచకులకు చెందిన అరుణ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పంజాబ్ ప్రభుత్వ ఉన్నతాధికారులమని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు తనను సంప్రదించారని, వీడియోలో ఉన్నది సీఎం కాదని తేల్చేలా ముందే రాసుకున్న నివేదికపై
