
ఐఫోన్ 18 ప్రో మాక్స్స్క్రీన్ మరమ్మత్తు ఖర్చు మీకు షాక్ ఇస్తుంది
ఐఫోన్ 18 ప్రో లేదా ప్రో మాక్స్‌ను వారంటీ ముగిసిన తర్వాత మరమ్మత్తు చేయించుకోవాలంటే, తీవ్రమైన నష్టం జరిగితే ఖర్చు ఆరు అంకెలలోకి చేరవచ్చు. అయితే, ఆపిల్ అందించిన సమ

ఐఫోన్ 18 ప్రో లేదా ప్రో మాక్స్‌ను వారంటీ ముగిసిన తర్వాత మరమ్మత్తు చేయించుకోవాలంటే, తీవ్రమైన నష్టం జరిగితే ఖర్చు ఆరు అంకెలలోకి చేరవచ్చు. అయితే, ఆపిల్ అందించిన సమ

Nellore: పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు 'జై కొట్టు' నినాదం ఆవిష్కరణ నెల్లూరు: యువతను రాజకీయాల్లో భాగస్వామ్యం చేయడంతో పాటు సమాజంలో మార్పుకు వారిని భాగస్వాములుగా చేయడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు దుగ్గిశెట్టి సుజిబాబు అన్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పరమేశ్వరి కళ్యాణ మండపంలో బుధవారం సుజయ్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ యువత కోసం ‘జై కొట్టు’ అనే నినాదాన్ని ఆవిష్కరించి ప్రకటించారు. దీంతో కార్యక్రమ ప్రాంగణం జనసేన కార్యకర్తలు, యువత నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ.. యువతలో రాజకీయ చైతన్యం తీసుకురావడంతో పాటు జనసేన పార్టీలో వారికి సముచిత భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. ‘జై కొట్టు’ నినాదంతో యువతను పెద్ద సంఖ్యలో రాజకీయాల వైపు ఆకర్షించి, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. యువతతోనే సమాజంలో గణనీయమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించడం రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైన ఘట్టమని సుజయ్ బాబు అన్నారు. జనసేన పార్టీకి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆదరణకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో యువతను సమష్టిగా ముందుకు నడిపించి వైఎస్సార్సీపీని 11 స్థానాల నుంచి ఒక్క స్థానానికి పరిమితం చేసే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం పవన్‌కళ్యాణ్ నాయకత్వంతోనే సాధ్యమవుతుందని సుజయ్ బాబు అన్నారు. ‘జై కొట్టు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న లక్ష్యంతో యువతతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.అనంతరం భారీ కేక్ ను కట్ చేసి

రూ.2వేల కోట్ల పెట్టుబడి, వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మాణం విశాఖపట్నం: ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ(AIG) ఆసుపత్రి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు విశాఖ ఆనందపురం మండలం ఎండాడ వద్ద ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణానికి సంస్థ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ముందుగా ఎండాడ వద్ద వేదిక ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు ఏఐజీ హాస్పిటల్స్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆసుపత్రికి సంబంధించి రూపొందించిన ఏవీని వీక్షించారు. రూ.2వేల కోట్ల పెట్టుబడి, 9వేల మందికి ఉద్యోగ అవకాశాలు విశాఖలో నెలకొల్పనున్న ఏఐజీ ఆసుపత్రి ద్వారా సంస్థ దశలవారీగా ఐదేళ్లలో 2వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 9వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. పూర్తిస్థాయి నిర్మాణం పూర్తయ్యే నాటికి ఆసుపత్రి సామర్థ్యం వెయ్యి పడకలకు చేరనుంది. విశాఖలో 9 ఎకరాల్లో ఆసుపత్రి క్యాంపస్, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయనుంది. ఒకే క్యాంపస్‌లో వైద్య సేవలు, శిక్షణ, పరిశోధన, రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన కంప్లీట్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్‌ను నెలకొల్పనుంది. మొదటి దశ నిర్మాణాలను 650 పడకల సామర్థ్యంతో 2028 అక్టోబర్ నాటికి పూర్తిచేయనున్నారు. రెండో దశ నిర్మాణాలను 350 పడకల సామర్థ్యంతో రెండేళ్లలో పూర్తిచేయనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో అందించే పూర్తిస్థాయి వైద్య సేవలను ప్రతిబింబించేలా 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబు, ఏఐజీ హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ పీవీఎస్ రాజు, డైరెక్టర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీమియర్ హెల్త్‌కేర్ సేవలను విస్తరించే దిశగా విశాఖపట్నంలో ఏఐజీ హాస్పిటల్స్ భారీ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు 2,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఏఐజీ హాస్పిటల్స్ క్యాంపస్‌కు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు హైదరాబాద్ స్థాయి ఉచిత, సంక్లిష్ట వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్, అకడమిక్ మరియు రీసెర్చ్ క్యాంపస్‌ను ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టును ఐదేళ్ల కాలవ్యవధిలో దశలవారీగా అభివృద్ధి చేయడానికి ఏఐజీ హాస్పిటల్స్ యజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 9 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆసుపత్రి భవనం, మరో 2.5 ఎకరాల్లో నర్సింగ్ కాలేజీ మరియు అనుబంధ సౌకర్యాలను నిర్మిస్తారు. మొదటి దశలో 650 పడకల సామర్థ్యంతో టవర్ A, B లను 2028 అక్టోబర్ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత రెండేళ్ల వ్యవధిలో రెండవ దశ కింద మరో 350 పడకల టవర్ C నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఏఐజీ హాస్పిటల్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ పనులు పూర్తయితే రోజువారీ ప్రాతిపదికన దాదాపు 5,000 మంది రోగులకు బాహ్య వైద్య సేవలు అందించవచ్చని ప్రతినిధులు వెల్లడించారు. దీంతో సంక్లిష్టమైన గ్యాస్ట్రో, లివర్, ట్రాన్స్‌ప్లాంట్, ఆంకాలజీ వంటి వైద్య చికిత్సల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉత్తరాంధ్ర ప్రజలకు తప్పుతుంది. ఇదిలా ఉండగా ఈ క్యాంపస్ ద్వారా దాదాపు 9,000 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో మదర్ అండ్ చైల్డ్ కేర్ ఫెసిలిటీతో పాటు 50కి పైగా స్పెషాలిటీ రంగాలు కూడా అందుబాటులో ఉంటాయి. దక్షిణ భారతదేశంలో విశాఖపట్నాన్ని ప్రధాన హెల్త్‌కేర్ హబ్‌గా తీర్చిదిద్దే వ్యూహంలో ఈ ఏఐజీ హాస్పిటల్స్ ప్రాజెక్ట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. శుక్రవారం నాటికి ఈ కార్యక్రమం 26వ రోజుకు చేరుకుంది. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 74.30 లక్షల ఇళ్లను పార్టీ నాయకులు, కార్యకర్తలు సందర్శించినట్లు తెలుగుదేశం పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కేవలం శుక్రవారం ఒక్కరోజే 2,50,129 కుటుంబాలను కలిసినట్లు పేర్కొంది. పార్టీ శ్రేణులు ప్రతి గడపకూ వెళ్లి, ప్రభుత్వ పనితీరుపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకుంటున్నాయి.ఈ సందర్శనల సందర్భంగా, రైతులు, మహిళలు, యువత, పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను, సంక్షేమ పథకాల వివరాలను ఆయా కుటుంబాలకు నేతలు వివరిస్తున్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నట్లు పార్టీ తెలిపింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు

మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు... లాతూర్, ఆగస్ట్ 20: మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. పాఠశాలల అభివృద్ధిలో విఫలమైన మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల అభివృద్ధి కోరుతూ ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో సీజేపీ గతవారం ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా దీప్కే గురువారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉజని గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్‌ను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ప్రజాప్రతినిధులు, మంత్రులను బాధ్యులుగా చేయాలన్నారు. చాలా పాఠశాలల్లో సరైన తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేవని, ఇక కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను జంతువుల కంటే దారుణంగా చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని.. అప్పుడు సగటు విద్యార్థులు పడే బాధలు వారికి తెలిసి వస్తాయన్నారు. పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీ టైగర్స్, ఈస్ట్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్లో లక్ష్య తరేజా అనే బ్యాటర్ పవర్ఫుల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి కాస్త మెయిన్ అంపైర్‌గా ధర్మేశ్ భరద్వాజ్ చెవి భాగంలో బలంగా తాకింది. అంపైర్ అప్రమత్తమై కిందికి వంగినప్పటికీ బంతి నుంచి తప్పించుకోలేకపోయాడు. వెంటనే అంపైర్‌ను పరీక్షించిన ఫిజియోలు మైదానం నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే ఈ అంపైర్‌కు మైదానంలో బంతి తాకడం ఇదే తొలిసారి కాదు. ఇదే సీజన్ ఆరంభంలో మరో బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ అతని భుజానికి బలంగా తాకింది. కానీ ఆ సమయంలో పెద్ద గాయం కాలేదు. అంపైర్‌ను గాయపర్చిన లక్ష్య తరేజా 25 బంతుల్లో ఫోర్‌తో 21 పరుగులు చేశాడు. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు 'పాపం అంపైర్' అంటూ సానుభూతి చూపిస్తున్నారు. అంపైర్లు కూడా హెల్మెట్లు వాడాలని, టీ20 ఫార్మాట్లో తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు. డీఆర్ఎస్తో ఊహించని లైఫ్.. పడిక్కల్‌ను హగ్ చేసుకున్న రాహుల్! బుల్లెట్ త్రోతో అంపైర్‌ను భయపెట్టిన సిరాజ్.. వీడియో వైరల్

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. 22వ రోజుకు చేరుకున్న ఈ కార్యక్రమం ద్వారా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే 64 లక్షలకు పైగా కుటుంబాలను నేరుగా కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఈ ప్రచారంలో ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.సోమవారం నాటికి ఈ కార్యక్రమం 22 రోజులు పూర్తి చేసుకుంది. 22వ రోజున రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 64.21 లక్షల కుటుంబాలను నేరుగా చేరుకున్నట్లయింది. ఇప్పటికే 60 లక్షల ఇళ్ల సందర్శన మైలురాయిని అధిగమించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ఈ ఇంటింటి పర్యటనల్లో భాగంగా, టీడీపీ నాయకులు గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమం, మహిళలు, యువతకు అందిస్తున్న ప్రయోజనాలు, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ప్రతి కుటుంబం దృష్టికి తీసుకెళుతున్నారు.కేవలం ప్రభుత్వ విజయాలను వివరించడమే కాకుండా, ప్రజలతో నేరుగా సంభాదిస్తూ వారి అభిప్రాయాలు, స్థానిక సమస్యలు, అవసరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ పాలన ఫలాలను ప్రతి గడపకు చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ముందుకు

సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, కొందరి జీవితాల్లో బలమైన స్ఫూర్తిని నింపి, వారి గమనాన్ని నిర్దేశిస్తాయి. సరిగ్గా ఇలాంటి ఓ సంఘటనే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జీవితంలో చోటుచేసుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన 'స్వదేశ్' సినిమా తనను ఎంతగా ప్రభావితం చేసిందో, ప్రజాసేవ వైపు ఎలా నడిపించిందో ఆయన తాజాగా వెల్లడించారు. ఈ స్ఫూర్తితోనే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన సొంతూరులో 'స్కూల్ ఠీక్ కరో' (పాఠశాలలను బాగుచేయండి) అనే ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు.మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్న తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా బెంచీలు, తాగునీటి సరఫరా, కిటికీలు, మరుగుదొడ్ల వంటి కనీస వసతుల కొరతను ఆయన ఎత్తిచూపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో తన అనుభవాలను పంచుకున్నారు."చిన్నప్పటి నుంచి 'స్వదేశ్' సినిమా చూస్తూ పెరిగాను. ఆ సినిమాతో ఎంతగా ప్రేమలో పడ్డానంటే, ఇప్పటికి వందకు పైగా సార్లు చూసి ఉంటాను. అందులోని మోహన్ పాత్ర నన్ను ఎంతగానో కదిలించింది. అమెరికా నుంచి తిరిగొచ్చి సొంత గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనకు ఆ పాత్రే స్ఫూర్తి. సినిమాలో మోహన్, హరిదాస్ అనే వ్యక్తిని కలిసినప్పుడు, అతను కుటుంబాన్ని పోషించడానికి పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోతాడు. తిరుగు ప్రయాణంలో రైల్వే స్టేషన్లో ఓ చిన్న పిల్లవాడు బడికి వెళ్లకుండా నీళ్లు అమ్ముకోవడం చూసి మోహన్ కంటతడి పెడతాడు. ఆ దృశ్యం

దేశభక్తికి భాష అవసరం లేదు.. గుండెల్లో దేశం ఉంటే చాలు. జాతీయ గీతం వినిపించకపోయినా ప్రతి హృదయంలో మార్మోగొచ్చు. మాటలు పలకలేని చిన్నారులు చేతులతో ‘జనగణమన’ను ఆవిష్కరించిన ఆ క్షణం.. దేశభక్తికి కొత్త అర్థం చెప్పింది. దాదాపు 500 మంది చిన్నారులు ఒక్కసారిగా తమ చేతులను కదిలిస్తుంటే.. సంగీతం, శబ్దం లేకపోయినా దేశభక్తి మార్మోగింది. ప్రతి కదలికలో భారత్ కనిపించింది. ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించిన ఆ మౌన గీతం.. దేశభక్తికి అసలు స్వరం హృదయమేనని చాటిచెప్పింది.ముద్రా గ్రూప్.. బిగ్ సినిమాస్ కోసం 2011లో రూపొందించిన ‘ది సైలెంట్ నేషనల్ ఆంథమ్’ ప్రచారం వెనుక ఈ అద్భుతమైన ఆలోచన ఉంది. ‘‘దేశభక్తికి భాష లేదు’’ అంటూ బాబీ పవార్ ఆలోచన నుంచి ఈ ప్రయోగం పుట్టింది. సాధారణంగా జాతీయ గీతాన్ని వింటాం. కానీ ఈసారి దాన్ని వినకుండా చూడాల్సి వచ్చింది. వినికిడి, మాటల లోపం ఉన్న చిన్నారులు సంకేత భాషలో ‘జనగణమన’ను ప్రదర్శించారు.ముంబయిలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు చెందిన 8 పాఠశాలల్లోని దాదాపు 500 మంది చిన్నారులు ఇందులో పాల్గొన్నారు. ప్రతి చిన్నారి చేతి కదలికలో ఓ భావం కనిపించింది. ప్రతి చూపులో ఓ గర్వం ప్రస్పుటమైంది. ప్రతి సంకేతంలో ‘నేను భారతీయుడిని’ అనే మాట వినిపించింది. వారి గొంతులు వినిపించకపోయినా.. వారి దేశభక్తి మాత్రం ప్రేక్షకుల హృదయాలను తాకింది. థియేటర్లో ఆ దృశ్యాన్ని చూసిన చాలామంది కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.ఈ ప్రచారంలో పెద్ద పెద్ద మాటలు లేవు. భారీ హంగులు లేవు. కేవలం నిర్మలమైన చిన్నారులు.. నిజమైన

సురక్ష కా తిరంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు (శుక్రవారం) నిర్వహించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సురక్ష కా తిరంగా సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు (శుక్రవారం) నిర్వహించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్‌ను చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా SPARK క్లబ్ విద్యార్థుల ప్రతినిధులు హాజరయ్యారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించింది. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అధికారులు తెలిపారు. బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరసత్వంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘Stay Alert , Stay Aware, Stay Safe & Secure’ నినాదంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో గురువారం పర్యటించారు. నక్కపల్లిలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం ఇటీవల మృతిచెందిన విద్యార్థి వరహాలు బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వరహాలు బాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ విద్యార్థి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, మరొక మానవునికి జీవన దానాన్ని అందించగల ఒక నిర్ణయం అపారమైన శక్తిని ఇస్తోందనే విషయాన్ని మనం గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, మరొక మానవునికి జీవన దానాన్ని అందించగల ఒక నిర్ణయం అపారమైన శక్తిని ఇస్తోందనే విషయాన్ని మనం గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించారు. అవయవ దానంపై మరింత అవగాహనను కల్పిద్దామని పేర్కొన్నారు. దాతలుగా మారడానికి అవగాహనతో కూడిన నిబద్ధతను కనబరిచేలా ఎక్కువ మంది పౌరులను ప్రేరేపిద్దామని తెలిపారు. ఒకరి జీవితాన్ని పొడిగించలేనప్పుడు, మరొకరికి జీవితాన్ని ఇవ్వడం ద్వారా దానికి కొత్త అర్థాన్ని ఇవ్వవచ్చని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి దానం ఒక ఆశకు వాగ్దానంగా మారేలా, ప్రతి దాత చిరకాలం నిలిచిపోయే వారసత్వాన్ని వదిలి వెళ్లేలా మనం ఉదారత సంస్కృతిని నిర్మిద్దామని తెలిపారు. జీవితాన్ని దానం చేయాలని.. ఆశను ఇవ్వండి, ప్రాణాలను కాపాడండి అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ! Ibrahimpatnam: మున్సిపల్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ లొ మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బూర నర్సయ్య గౌడ్ మరియు ప్రభుత్వ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన బూర నర్సయ్య గౌడ్ గతంలో 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో అణగదొక్కబడి ఆకలికి అలమటించామని ఎంతోమంది స్వాతంత్రం కోసం శ్రమించి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడం జరిగిందని. వచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకోవాలని కోరారు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రధాని ఈ దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళుతూ ప్రగతి వైపు తీసుకు వెళుతున్నాడని ఈ సందర్భంగా చెప్పారు. భారత దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా – దేశభక్తి ప్రతి ఇంటా, త్రివర్ణ పతాకం ఎగురవేయాలని చెప్పారు. . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. . వాయిస్ బూర నర్సయ్య గౌడ్

పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు జార్జినా రోడ్రిగెజ్‌తో పదేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన రొనాల్డో మంగళవారం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తన పెండ్లి విషయాన్ని రొనాల్డో స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫొటోలను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. కాగా రొనాల్డో షేర్ చేసిన ఫొటోలో అతడు, జార్జినా ఒకరి చేతిని మరొకరు పట్టుకుని కనిపించారు. ఇద్దరి చేతులకు వివాహ ఉంగరాలు ఉన్నాయి. ఈ ఫొటోతోనే తమ వివాహాన్ని రొనాల్డో అధికారికంగా వెల్లడించారు. 'సీ లవ్స్ జీ' అంటూ ఎమోజీ జత చేసి క్యాప్షన్ ఇచ్చాడు. క్రిస్టియానో, జార్జినా పేర్లలోని తొలి అక్షరాలతో ఈ క్యాప్షన్ రూపొందించాడు. రొనాల్డో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఫుట్‌బాల్ అభిమానులు, ఆటగాళ్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 2016లో చిగురించిన ప్రేమ క్రిస్టియానో రొనాల్డో, జార్జినాల మధ్య 2016లో ప్రేమ చిగురించింది. మాడ్రిడ్‌లోని ఒక గూచీ స్టోర్‌లో జార్జినా సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో రొనాల్డో ఆమెను మొదటిసారి కలిశాడు. ఆ తర్వాత ఒక ఫ్యాషన్ ఈవెంట్లో మళ్లీ కలుసుకున్నఈ జంట డేటింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత క్రమంగా తమ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టారు. 2017 జనవరిలో జ్యూరిచ్‌లో జరిగిన 'ది బెస్ట్ ఫీఫా ఫుట్‌బాల్ అవార్డ్స్'లో వారు మొదటిసారి అధికారికంగా కలిసి కనిపించారు. ఆ తర్వాత అదే సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్‌లో తమ మొదటి జంట ఫోటోను పంచుకున్నారు. 2017 నవంబర్‌లో ఈ ప్రేమికులకు కుమార్తె అలనా మార్టినా పుట్టింది. అలనాను పెంచడంతో పాటు, క్రిస్టియానో జూనియర్, ఇవా, మాటియోల పెంపకంలో రోడ్రిగ్జ్ బిజీగా మారిపోయింది. 2022 ఏప్రిల్‌లో, ఈ దంపతులు కవల కుమార్తెలకు స్వాగతం పలికారు. ఇక 2025 ఆగస్టులో జార్జినా రోడ్రిగ్జ్ రొనాల్డో తొడిగిన ఉంగరాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ‘నీ ప్రొపోజల్‌కు అంగీకరిస్తున్నా’ అని క్యాప్షన్ జత చేసి నిశ్చితార్థం జరిగినట్లు ధృవీకరించింది. ఇక

Uppal: బేకరీలో కాలం చెల్లిన ఫుడ్ కలర్స్: ఎం-ఫాస్ట్, ఎస్ఓటీ దాడి! ఈ వార్తకు సంబంధించిన

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న 'ఇంటింటికీ తెలుగుదేశం - 2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమం 16వ రోజూ రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభరితంగా కొనసాగింది. ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుస్తూ, ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్న పార్టీ శ్రేణులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.16వ రోజున రాష్ట్రవ్యాప్తంగా 3.25 లక్షల ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. దీంతో కార్యక్రమం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు 16 రోజుల్లో మొత్తం 47.50 లక్షల గృహాలను టీడీపీ శ్రేణులు సందర్శించినట్లయింది. ప్రతి రోజూ మూడు లక్షలకు పైగా కుటుంబాలను కలుస్తూ పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, రైతు సంక్షేమం తదితర కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు.'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా, ఉత్సాహంగా భాగస్వాములవుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. కార్యక్రమ నిర్వహణలో చురుగ్గా ముందంజలో ఉన్న నియోజకవర్గాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను యువనేత అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని వారికి సూచించారు. ప్రజలతో మరింతగా మమేకమవుతూ కూటమి ప్రభుత్వం

రోడ్డుపై గుంతలు.. బురదతో నిత్యం ఇబ్బందులు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో మహారాష్ట్రలోని ముగ్గురు పాఠశాల విద్యార్థినులు వినూత్నంగా నిరసన తెలిపారు. చేతిలో మొబైల్ ఫోన్.. మైక్‌కు బదులుగా గొడుగు పట్టుకుని రోడ్డుపై ‘న్యూస్ రిపోర్ట్’ చేశారు. వారి వ్యంగ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. చివరకు రోడ్డుకు మరమ్మతులు చేశారు.రాయ్‌గఢ్‌కు చెందిన నేహా ఘరే, జ్యోత్స్నా ముకానే, మాన్సీ పవార్ పదో తరగతి చదువుతున్నారు. ముగ్గురి వయసు 15 ఏళ్లు. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి తమ పాఠశాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. భారీ గుంతలు, బురదతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నేహా, జ్యోత్స్నా, మాన్సీ ఓ వినూత్న ఆలోచన చేశారు. నేహా రిపోర్టర్‌గా మారింది. గొడుగును మైక్‌లా పట్టుకుని జ్యోత్స్నాను రోడ్డు పరిస్థితిపై ప్రశ్నించింది. మాన్సీ మొత్తం దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించింది. గుంతలు, బురదను చూపిస్తూ వ్యంగ్యంగా రూపొందించిన ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.వీడియో అధికారుల దృష్టికి వెళ్లడంతో రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. దీంతో బాలికలకు స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబసభ్యులు, గ్రామస్థులు, రాజకీయ నాయకులు వారిని అభినందించారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే కూడా బాలికలను కలవడానికి ఆసక్తి చూపించారు.‘‘మా కుమార్తెలు చేసిన పనికి గర్వంగా ఉంది. ఇలాంటి సమస్యలను ప్రభుత్వం గుర్తించాలి’’ అని నేహా తండ్రి ఆత్మారామ్ ఘరే తెలిపారు

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఇవాళ (మంగళవారం) ప్రధాని నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్టు చేశారు. ఆగస్టు 15న జెండా పండుగను ప్రజలంతా సగర్వంగా నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఢిల్లీ: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (మంగళవారం) ఓ వీడియో పోస్టు చేశారు. ఆగస్టు 15న జెండా పండుగను ప్రజలంతా సగర్వంగా నిర్వహించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా ‘హర్ ఘర్ త్రివర్ణ’ ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఆగస్టు 15ని గర్వంగా జరుపుకోండి, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించండి, వికసిత్ భారత్ కోసం ప్రతిజ్ఞ చేయండి. హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రతి ఇంటిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఓ వేడుకలా నిర్వహించాలని కోరారు. త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ సేవలందించేందుకు అది నిరంతరం స్ఫూర్తినిస్తుందని ప్రధాని చెప్పుకొచ్చారు. ఈసారి హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని, భారత్ నిర్మాణానికి దోహదపడాలని ఆకాంక్షించారు. అలాగే, ఈ ఏడాది వందేమాతరం జాతీయ గీతం ఇతివృత్తంగా వేడుకలు నిర్వహించనున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఏళ్ల తర్వాత ఎస్బీఐ లాకర్ తెరిచిన మహిళకు షాక్.. ప్రైవేటు ఆస్పత్రుల్లో గది అద్దెలకు కళ్లెం.. పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ కీలక సిఫారసు

హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు రేపు భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. హైదరాబాద్, ఆగస్టు 11: హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు రేపు(బుధవారం) భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. హెచ్ఐవీ, ఎయిడ్స్, సిఫిలిస్ నియంత్రణే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు చెప్పారు. ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ కొనసాగనుందని మంత్రి తెలిపారు. సుమారు 1500 మంది ర్యాలీలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. హెచ్ఐవీ బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి తెలిపారు. హెచ్ఐవీ ఇతరులకు, ముఖ్యంగా పుట్టబోయే శిశువులకు సంక్రమించకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ నిర్మూలన ప్రచారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘బి పాజిటివ్ టు స్టాప్ హెచ్ఐవీ పాజిటివ్’ నినాదంతో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణను హెచ్ఐవీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. కాగా.. రేపు ఈ ర్యాలీలో మంత్రులు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించనున్నారు. కాలేజీ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ర్యాలీలో పాల్గొననున్నారు. పేద పిల్లల కలలకు చిరునామాగా.. యంగ్ ఇండియా స్కూల్స్: సీఎం రేవంత్ రెడ్డి పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ఇవ్వాలి... ప్రధానికి వీహెచ్ లేఖ

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సూచించారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని బండి సంజయ్ హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద జాతీయ జెండాను ఈరోజు (సోమవారం) ఎగురవేశారు. అనంతరం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాకు బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'తిరంగా యాత్ర'లను విజయవంతంగా నిర్వహించాలి.. దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ కార్యక్రమాలను చేపడుతున్నట్లు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈరోజు నుంచి ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో 'తిరంగా యాత్ర'లను విజయవంతంగా నిర్వహించాలని బీజేపీ శ్రేణులను బండి సంజయ్ కోరారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు పెద్దఎత్తున భాగస్వామ్యమై స్వచ్ఛందంగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశంపై తమకున్న భక్తిభావాన్ని చాటుకోవడానికి ఇది సువర్ణావకాశమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేయాలి.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందుగా, ఆగస్టు 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మహాపురుషులు, స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసి, స్మారక చిహ్నాల చుట్టూ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ శ్రేణులను బండి సంజయ్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Har Ghar Tiranga 2026: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. అందులో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ ప్రోగ్రాం పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ లోని తన నివాసం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ ప్రోగ్రామ్‌లు నేటి నుంచి “హర్ ఘర్ తిరంగా అభియాన్”కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో 'తిరంగా యాత్ర'లను విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ కోరారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వామ్యమై స్వచ్ఛందంగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశంపై తమకున్న భక్తిభావాన్ని చాటుకోవడానికి ఇది సువర్ణావకాశమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందుగా, ఆగస్టు 12 నుంచి 14 వరకు మహాపురుషులు, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసి, స్మారక చిహ్నాల చుట్టూ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి ప్రదర్శనలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రతి పౌరుడిని మానసికంగా

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గురి జిల్లా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఒక బంగ్లాదేశీ చొరబాటుదారుడిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా... బంగ్లాదేశీయులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించి దీపాంకర్ గోప్ అనే భారతీయ తేయాకు రైతును అపహరించి బంగ్లాదేశ్‌కు తీసుకెళ్లారు. తమ దేశానికి చెందిన వ్యక్తిని భారత్ విడుదల చేస్తేనే, రైతును తిరిగి పంపిస్తామని బంగ్లాదేశ్ సరిహద్దు బలగాలు (బీజీబీ), స్థానికులు దబాయిస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజ్‌గంజ్ బ్లాక్ పరిధిలోని సరిహద్దు కంచెకు సమీపంలో ఉన్న తన తేయాకు తోటలో పనిచేసుకుంటున్న దీపాంకర్‌పై దాదాపు 15 మందికి పైగా బంగ్లాదేశీయులు ఒక్కసారిగా దాడి చేసి, ఈడ్చుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎస్ఎఫ్ అధికారులు, బంగ్లాదేశ్ బీజీబీ అధికారులతో అత్యవసర ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి రైతును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సొంత నియోజకవర్గంలో రైతులకు భద్రత లేకపోవడంపై స్థానిక తేయాకు తోటల సంఘాలు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని, సంక్షేమ ఫలాలను ప్రజలకు నేరుగా వివరించే ఈ కార్యక్రమం ఆదివారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. గడిచిన 14 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు 40.74 లక్షలకు పైగా కుటుంబాలను నేరుగా కలుసుకుని రికార్డు సృష్టించాయి.కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనతో ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 3.53 లక్షల ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 'సూపర్ సిక్స్' హామీల అమలు తీరును, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అందుతున్న ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి వివరిస్తున్నారు.ఈ కార్యక్రమ పురోగతిపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ప్రత్యేక దృష్టి సారించారు. కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఆయన పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో తప్పనిసరిగా పర్యటించాలని, ప్రజలతో మమేకమై ప్రభుత్వ విజయాలను వివరించాలని స్పష్టం చేశారు. క్లస్టర్, మండల స్థాయి నాయకులను ఫోకస్ బూత్‌లకు అనుసంధానించి, సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో సమష్టిగా పాల్గొంటున్నారని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై