
Faria Abdullah : కనకాంబరం కలర్ చీరలో ఫరియా అబ్దుల్లా.. క్యూట్ ఫోటోలు..
నటి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) కనకాంబరం కలర్ చీరలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

నటి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) కనకాంబరం కలర్ చీరలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

Faria Abdullah has responded to the trolling she faced after participating in Bonalu celebrations, saying people may still hold outdated mindsets despite living in 2026. బోనాలు సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నందుకు ఎదురైన సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫరియా అబ్ధుల్లా స్పందించారు

బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో సైమా అవార్డ్స్ 2026 వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో నటి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతూ సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా సిగ్మా సినిమా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఈవెంట్ చెన్నైలో జరగగా ఫరియా ఇలా చీరకట్టులో వచ్చి క్యూట్ గా అలరించింది.

దాదాపు మూడు దశాబ్దాల క్రితం కానిస్టేబుల్‌ను హత్య చేసి పరారైన మాజీ నక్సలైట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల, ఆగస్టు21: దాదాపు మూడు దశాబ్దాల క్రితం కానిస్టేబుల్‌ను హత్య చేసి పరారైన మాజీ నక్సలైట్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 1992లో నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్ల కాలువ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సును అడ్డుకుని హెడ్ కానిస్టేబుల్ షేక్ అబ్దుల్ కరీంను మాజీ నక్సలైట్ మాడుగుల సుబ్బన్న కాల్చి చంపాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ1గా మాడుగుల సుబ్బన్న పేరును పోలీసులు చేర్చారు. నాటి నుంచి అతడి కోసం గాలించినా.. ఆచూకీ లభ్యం కాలేదు. అయితే అతడు కర్ణాటకలోని చిత్రదుర్గలో నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఇటీవల రహస్య సమాచారం అందింది. దీంతో ఆత్మకూరు సీఐ సురేశ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఓ బృందం కర్ణాటక వెళ్లింది. చిత్రదుర్గలో మాడుగుల సుబ్బన్న అలియాస్ గుంటూరు గద్దర్ అలియాస్ మంజునాథ్ పాటిల్‌ను వారు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని నంద్యాల జేఎంఎఫ్‌సీ (JMFC) కోర్టులో హజరుపరిచారు. 34 ఏళ్లుగా పరారిలో ఉన్న మాజీ నక్సలైట్ మాడుగుల సుబ్బన్న అరెస్ట్‌తో ఆత్మకూరు మండల కేంద్రంలో కలకలం రేగింది. సీఎం రేవంత్ యూఎస్ పర్యటనకు నో క్లియరెన్స్.. స్పందించిన కేంద్రం ఉయ్యూరులో డయేరియాపై అసత్యాలు ప్రచారం: మంత్రి నారాయణ ఫైర్

కార్గిల్‌లో భద్రతా సిబ్బందితో ఒక మహిళా పర్యాటకురాలు వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. "మేం జెన్-జీ" అంటూ ఆ యువతి చేసిన వ్యాఖ్యను, గతంలో హోదాను ప్రదర్శించేందుకు వాడే "నా తండ్రి ఎవరో తెలుసా?" అనే అహంకారపూరిత మాటతో ఆయన పోల్చారు.బుధవారం 'ఎక్స్' వేదికగా ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, "నా తండ్రి ఎవరో తెలుసా' అనే మాట స్థానంలో ఇప్పుడు 'మేం జెన్-జీ' అనే కొత్త పదం వచ్చి చేరింది. చిన్న చిన్న విషయాలకే ఇలా 'జెన్-జీ' అంటూ బెదిరింపులకు దిగితే, ఆ తరం పట్ల సమాజంలో ఉన్న సద్భావనను వేగంగా దెబ్బతీయడమే అవుతుంది" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.అసలేం జరిగింది?లద్దాఖ్‌లోని కార్గిల్‌లో ఉన్న మినీమార్గ్ చెక్‌పాయింట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జులై 25న కార్గిల్ విజయ్ దివస్‌కు ఒక రోజు ముందు, వాతావరణం అనుకూలించకపోవడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. వారి కాన్వాయ్ సజావుగా సాగేందుకు జోజిలా-గుమ్రి మార్గంలో ట్రాఫిక్‌ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.ఈ ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ యువతి, భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. "మేం జెన్-జీ, ఇలాంటి అర్థం లేని పనులను సహించం. ఇప్పటివరకు కశ్మీరీలతోనే ఇలా ప్రవర్తించేవారు, ఇప్పుడు పర్యాటకులతో కూడా మొదలుపెట్టారా?" అని ఆమె ప్రశ్నించడం వీడియోలో రికార్డయింది. ఈ ఘటన జులై 25న జరగ్గా, ఆగస్టు 19న ఈ

దశాబ్దాలుగా భారత్ లో కాశ్మీర్ అంతర్భాగంగా ఉన్నా, అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే పాలిస్తున్నా.. ఈ ప్రాంతం తమదే అంటూ అంతర్జాతీయ వేదికలపై చెప్పుకునే పాకిస్తాన్ కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాశ్మీర్ పర్యటనకు వచ్చిన అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor)జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ భారత్ లో ఓ ముఖ్యమైన అంతర్భాగమని సెర్గియో గోర్ తేల్చిచెప్పేశారు. దీంతో పాటు కాశ్మీర్ కు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు.దారుణంగా పడిపోయిన భారత్ ఇమేజ్- అమెరికన్లలో సగం- తాజా సర్వేలో షాకింగ్..!ఆర్టికల్ 370 రద్దు, పహల్గాం దాడుల తర్వాత ఒక అమెరికా రాయబారి శ్రీనగర్ కు రావడం ఇదే తొలిసారి. ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉందని, ఇది భారతదేశంలో ఒక ముఖ్యమైన భాగమని సెర్గియో తెలిపారు. తాను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి అని, ఇది అద్భుతమైన అందమైన ప్రదేశమని కితాబిచ్చారు. ఇక్కడ ఉండటం, ఈ ప్రదేశాన్ని చూడటం తనకు చాలా ఉత్సాహాన్నిస్తోందన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ విషయంలో అమెరికా విధించిన అత్యున్నత స్థాయి ప్రయాణ హెచ్చరికను తగ్గించడంపై పునరాలోచిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉగ్రవాద ముప్పు కారణంగా జమ్మూ కాశ్మీర్ పై అమెరికా లెవల్ 4 అంటే ప్రయాణించవద్దనే హెచ్చరికను అమలు చేస్తోంది. దీన్ని తగ్గిస్తామని సెర్గియో హామీ ఇచ్చారు. పాకిస్తాన్ కూటమికి భారత్ ఝలక్..! ఈజిప్ట్ నిర్ణయం వెనుక ?గోర్ పర్యటనకు ముందే, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ.. ఈ లోయలోని వేలాది కుటుంబాలు జీవనోపాధి కోసం పర్యాటకంపై ఆధారపడి ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అమెరికా తమ కఠినమైన ప్రయాణ హెచ్చరికను సమీక్షించి ఉపసంహరించుకోవాలని ఆయన్ను కోరారు. మరోవైపు సెర్గోయో గోర్.. రేపు లడఖ్‌లో పర్యటిస్తారు. 2020 నాటి గల్వాన్ ఘర్షణ, చైనాతో

జమ్మూకశ్మీర్ అంశంపై అమెరికా నుంచి కీలక వ్యాఖ్య వెలువడింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్ బుధవారం శ్రీనగర్‌లో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్ అంశంపై అమెరికా నుంచి కీలక వ్యాఖ్య వెలువడింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్ బుధవారం శ్రీనగర్‌లో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. అనంతరం 'జమ్మూకశ్మీర్ భారత్‌లో ఒక ముఖ్యమైన భాగం' అని వ్యాఖ్యానించారు. అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెర్గియో గోర్ జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి (Sergio Gor in JK). ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమెరికా రాయబారి శ్రీనగర్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌ను భారత్‌లోని ముఖ్యమైన భాగంగా అమెరికా రాయబారి బహిరంగంగా పేర్కొనడం ప్రాధాన్యం కలిగిన పరిణామం అని చెప్పాలి. జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్ తన వాదనను కొనసాగిస్తున్న సమయంలో భారత్ వైఖరికి అనుకూలంగా అమెరికా రాయబారి మాట్లాడడం అత్యంత కీలకంగా నిలవనుంది ( J&K Important Part of India). కాగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన జమ్మూకశ్మీర్‌తో పాటు లద్దాఖ్‌లోనూ పర్యటించనున్నారు. శ్రీనగర్‌లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిశారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్, అమెరికా మధ్య సంబంధాలను మరింత విస్తరించే అవకాశాలపై చర్చ జరిగినట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అంతకుముందు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన అంతర్గత సమస్యలను అమెరికా రాయబారి వద్ద ప్రస్తావించబోనని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ సమస్యలను పరిష్కరించాల్సింది న్యూఢిల్లీ అని, వాషింగ్టన్ కాదని ఆయన పేర్కొన్నారు (India US Relations). జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన అమెరికా ప్రయాణ హెచ్చరికను కూడా సమీక్షించే అవకాశం ఉందని సెర్గియో గోర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా తన పౌరులకు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, పౌర అశాంతి వంటి కారణాలతో ప్రయాణంపై హెచ్చరికలు జారీ చేస్తోంది. నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం.. పుణెలో దారుణం

భారత్‌లో అమెరికా రాయబారిగా వ్యవహరిస్తున్న సెర్గియో గోర్ శ్రీనగర్‌లో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కొన్ని గంటల ముందు మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ సమస్యల పరిష్కారం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుందని, వాషింగ్టన్ నుంచి కాదని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలను యూఎస్ రాయబారి ముందు ఉంచబోనని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. "మా సమస్యలకు పరిష్కారం వాషింగ్టన్ నుంచి రాదు. మా సమస్యలను మన కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలి" అని ఆయన తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో అమెరికా రాయబారి చెప్పే విషయాలను వినడానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గతంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై వైట్ హౌస్ ముందు నిరసన తెలుపుతానంటూ ఒమర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో, ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా దౌత్యపరమైన స్పష్టత ఇచ్చారు. గత 15 ఏళ్లలో ఒక అమెరికా రాయబారి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఇది రెండోసారి మాత్రమే. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణ జరిగిన నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. శ్రీనగర్ పర్యటన అనంతరం సెర్గియో గోర్ లడఖ్‌లో కూడా పర్యటించనున్నారు. 2020 గాల్వాన్ వ్యాలీ వివాదం తర్వాత అమెరికా రాయబారి లడఖ్ ప్రాంతాన్ని సందర్శించడం ఇదే తొలిసారి

హైదరాబాద్‌లోని బోనాల పండుగలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న నటి ఫరియా అబ్దుల్లా, సోషల్ మీడియాలో తీవ్ర మతపరమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. ముస్లిం అయి ఉండి హిందూ పండుగలో ఎలా పాల్గొంటావంటూ ఆమెను కాఫీర్ అని దూషించారు. ఈ విమర్శలతో మనస్తాపం చెందిన ఫరియా అబ్దుల్లా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన వ్యక్తిగత నేపథ్యం గురించి వివరిస్తూ, తన తండ్రి ప్రేమతో ఇస్లాంను స్వీకరించారని, మతాన్ని ప్రేమతో చూసే వాతావరణంలో తాను పెరిగానని ఫరియా తెలిపారు. దేవుణ్ణి ప్రతిచోటా, ప్రతి జీవిలో చూడాలని, ద్వేషాన్ని ప్రేమతో జయించడమే తన తిరుగుబాటు, విప్లవం అని ఆమె శక్తివంతమైన సందేశం ఇచ్చారు. ఈ ఘటనపై టీ-బీజేపీ చీఫ్ రామ్ చంద్ర రావు, విశ్వహిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్, అయోధ్యకు చెందిన సాధువు పరమహంస ఆచార్యతో పాటు పలువురు ఫరియాకు మద్దతుగా నిలిచారు. దేశం బహుళత్వం, మత సామరస్యానికి నిలయం అని స్పష్టం చేస్తూ ట్రోలింగ్‌ను తీవ్రంగా ఖండించారు. ఫరియా సందేశం నెటిజన్ల నుంచి విశేష ప్రశంసలు పొందుతోంది

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ హీస్ట్ డ్రామా ‘సిగ్మా’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ అనౌన్స్‌మెంట్‌తో పాటు సందీప్ కిషన్ సరికొత్త ఇంటెన్స్ పోస్టర్‌ను కూడా మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సిగ్మా సినిమాలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో చిత్ర బృందం త్వరలోనే టీజర్ మరియు ఇతర ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయనుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని యూనిట్ నమ్ముతోంది. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్‌ను పర్యవేక్షించారు. అన్బు దాసన్, యోగ్ జేపీ, షీలా రాజ్‌కుమార్, కిరణ్ కొండ వంటి నటీనటులు కూడా ఇందులో భాగమయ్యారు. కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు జేసన్ సంజయ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దసరా సెలవులను పురస్కరించుకుని అక్టోబర్ 2న థియేటర్లలో సందడి చేసేందుకు సిగ్మా సిద్ధమైంది. యాక్షన్ సన్నివేశాలు మరియు హీస్ట్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సిగ్మా’. ఈ సినిమాతో జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. యాక్షన్ హీస్ట్ డ్రామాగా రూపొందుతున్న ‘సిగ్మా’ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. విడుదల చేసిన పోస్టర్లో సందీప్ కిషన్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా.. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు దాసన్, యోగ్ జాపీ, షీలా రాజ్‌కుమార్, కిరణ్ కొండ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం, త్వరలోనే టీజర్, పాటలతో పాటు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది

తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న 'సిగ్మా' చిత్రం కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. ఇందులో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్నారు. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'సిగ్మా'. తెలుగువారైన సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ఇందులో జంటగా నటించారు. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. జూలై 31న 'సిగ్మా' సినిమా విడుదల కావాల్సింది. అయితే సరిగ్గా దానికి వారం ముందు విజయ్ 'జన నాయగన్' విడుదల కావడంతో 'సిగ్మా' సినిమాను వాయిదా వేశారు. అప్పుడు కొత్త రిలీజ్ డేట్ చెప్పని మేకర్స్ తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 'సిగ్మా' మూవీ గురించి లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం. తమిళ్ కుమరన్ మాట్లాడుతూ, 'జేసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది అతని తొలి చిత్రం అయినప్పటికీ, ప్రతి దశలో అతను చూపించిన స్పష్టత, నమ్మకం, క్రమశిక్షణ, అనుభవజ్ఞుడైన దర్శకుడిని తలపించాయి. సందీప్ కిషన్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృందం అందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు 'సిగ్మా'ను తీసుకురాబోతున్నాం' అని అన్నారు. దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ, 'నా విజన్‌ను నమ్మి, పూర్తి సృజనాత్మక స్వేచ్ఛను ఇచ్చిన మా నిర్మాత సుభాస్కరన్ సర్, జి.కె.ఎం. తమిళ్ కుమరన్ సర్, లైకా ప్రొడక్షన్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి ప్రోత్సాహం వల్లనే నేను అనుకున్న విధంగా ఈ సినిమాను తెరకెక్కించగలిగాను' అని తెలిపారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ తదితరులు పోషించారు. 'సిగ్మా' చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్

ప్రముఖ నటి, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యారు. బోనాల పండుగలో పాల్గొన్నందుకు తనను ట్రోల్ చేస్తున్న వారిపై స్పందిస్తూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ద్వేషాన్ని ప్రేమతోనే జయిస్తానని, తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ ఓ సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేశారు.ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ ఆలం మండిలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర అమ్మవారి ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఫరియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సంప్రదాయ దుస్తుల్లో బంగారు బోనం ఎత్తుకొని, డప్పు చప్పుళ్లకు ఉత్సాహంగా నృత్యం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.అయితే, ముస్లిం నేపథ్యం ఉన్న ఫరియా హిందూ పండుగలో పాలుపంచుకోవడాన్ని సోషల్ మీడియాలోని కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెను 'కాఫిర్' (మత విశ్వాసం లేని వ్యక్తి) అని సంబోధిస్తూ, మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ దారుణంగా ట్రోల్ చేశారు.ఈ ట్రోలింగ్‌పై ఫరియా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నారు. "మా నాన్న (సంజయ్ అబ్దుల్లా) పుట్టుకతో హిందువు. ఆయన ఇస్లాం సిద్ధాంతాలు నచ్చి ఆ మతంలోకి మారారు. ఒక మతాన్ని అంతగా ఇష్టపడి స్వీకరించిన వ్యక్తి నన్ను పెంచినప్పుడు, నాకు అందులోని మంచి విషయాలే కనిపించాయి" అని ఆమె భావోద్వేగంగా చెప్పారు. "నన్ను 'కాఫిర్' అని పిలుస్తూ ద్వేషించే వారికి కూడా మంచి జరగాలనే కోరుకుంటాను. నేను ద్వేషాన్ని ప్రేమతోనే ఎదుర్కొంటాను" అని స్పష్టం చేశారు.ప్రకృతిలోని చెట్లు, పుట్టలు, సీతాకోకచిలుకలు.. ఇలా ప్రతి అంశంలో తాను దైవాన్ని చూస్తానని ఫరియా
ఫరియా భావోద్వేగ వీడియోపై విశ్వహిందూ పరిషత్ రియాక్షన్ 'జాతిరత్నాలు' సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఎమోషనల్ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల హైదరాబాద్‌లో బోనాలు ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకున్నందుకుగానూ కొందరు నెటిజన్లు ఆమెను 'కాఫిర్' అని ట్రోల్ చేశారు. దీనిపై స్పందిస్తూ ఫరియా కన్నీళ్లు పెట్టుకుని, తన కుటుంబం, ఇస్లాం మత విశ్వాసాలు, ప్రేమ గురించి భావోద్వేగంగా మాట్లాడారు. నన్ను ద్వేషించే వారికి కూడా నేను ప్రేమే పంచుతానంటూ స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనపై వీహెచ్‌పీ (VHP) జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ స్పందిస్తూ.. హిందూ పండుగల్లో పాల్గొనే ముస్లిం నటీమణులను టార్గెట్ చేసే మత ఛాందసవాదులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వార్తకు సంబంధించిన

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Faria Abdullah:ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా పాల్గొంది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె పండుగలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. అక్కడ తనకు లభించిన ప్రేమ, ఆదరణ చూసి ఫరియా భావోద్వేగానికి గురైంది. అయితే బోనాల వేడుకల్లో ఆమె పాల్గొనడాన్ని కొందరు తప్పుబట్టారు. ఫరియా ముస్లిం కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కారణంగా, హిందూ పండుగలో ఎందుకు పాల్గొన్నావంటూ కొందరు సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆమెపై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తూ హేట్ మెసేజ్‌లు పంపినట్లు సమాచారం. తనను ‘ఇస్లాం ద్రోహి’ అంటూ కొందరు కామెంట్లు చేయడం ఫరియాను తీవ్రంగా బాధించింది. దీంతో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫరియా ఒక ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో మాట్లాడుతున్న సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తన కుటుంబ నేపథ్యం గురించి కూడా వివరించింది. ఫరియా చెప్పిన వివరాల ప్రకారం, ఆమె తల్లి ముస్లిం కుటుంబంలో జన్మించి తర్వాత హిందూ మతాన్ని ఇష్టపడి స్వీకరించారు. ఆమె తండ్రి హిందూ కుటుంబంలో జన్మించి తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించారు. తన తండ్రి ఇస్లాంలోని మంచి విషయాలను మాత్రమే తనకు నేర్పించారని ఫరియా తెలిపింది. తనకు ద్వేషించడం తెలియదని, ప్రేమించడం మాత్రమే తెలుసని ఫరియా చెప్పింది. తనపై విమర్శలు చేస్తున్న వారిని కూడా తాను ద్వేషించనని, వారు కూడా బాగుండాలని కోరుకుంటానని తెలిపింది. ప్రేమ, శాంతి, ఐక్యత కోసం తాను ఎప్పుడూ ప్రార్థిస్తానని ఫరియా

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీ బోనాల వేడుకల్లో పాల్గొన్న ఫరియాను కొందరు నెటిజన్లు మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ట్రోల్ చేశారు. తనపై వస్తున్న కామెంట్లపై స్పందించిన ఫరియా.. సెల్ఫీ వీడియో ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీ లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సందడి చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆమె బోనాల వేడుకల్లో పాల్గొనడాన్ని తప్పుబడుతూ కొందరు నెటిజన్లు మతపరమైన కోణంలో కామెంట్లు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై ఫరియా స్వయంగా స్పందించారు. తనను ట్రోల్ చేస్తున్న వారికి ఫరియా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో దేవుడిని చూడడమే అసలైన భక్తి అని చెప్పారు. మనసులో ద్వేషాన్ని పెంచుకుంటూ దేవుడిని వెతికితే అది సరైన మార్గం కాదని అభిప్రాయపడ్డారు. దేవుడు ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని.. ప్రతిచోటా విస్తరించి ఉండే దివ్యమైన వెలుగు అని ఫరియా పేర్కొన్నారు. అంతటి విశాలమైన మత భావనను సంకుచితమైన ఆలోచనలతో ఎలా పరిమితం చేస్తారని ప్రశ్నించారు. తనపై వస్తున్న ట్రోలింగ్‌తో బాధపడకుండా.. ద్వేషానికి ప్రేమతోనే సమాధానం ఇస్తానని ఫరియా స్పష్టం చేశారు. “నాపై ద్వేషం చిమ్మేవారికి నేను మరింత ప్రేమను పంచుతాను” అనే భావనతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీశాయి. సినిమాలతో పాటు తన డ్యాన్స్, ప్రత్యేకమైన స్టైల్‌తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు బోనాల వేడుకలు, ఆ తర్వాత వచ్చిన ట్రోలింగ్‌పై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫరియా వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు

హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్న టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఇటీవల నెట్టింట ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. అమ్మవారితో కలిసి బోనం ఎత్తి, పోతురాజులతో అడుగులేసిన ఆమెపై సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీంతో ఫరియా ఎమోషనల్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగానికి లోనై, కన్నీళ్లు పెట్టుకుంది. కన్నీటి పర్యంతమైన ఫరియా తన కుటుంబ నేపథ్యం, మత విశ్వాసాల గురించి స్పష్టతనిచ్చింది. తన తండ్రి ఇస్లాం మతాన్ని స్వీకరించారని, ఆ మతంలోని సత్ప్రవర్తన, మంచి గుణాలనే తనకు నేర్పించారని ఆమె వెల్లడించింది. “అల్లా అన్నింటా ఉంటారు” అనే తన తల్లి మాటలను గుర్తుచేసుకుంటూ, ప్రతి ప్రాణిలోనూ దైవత్వాన్ని చూస్తానని తెలిపింది. తనను ‘కాఫిర్’ అంటూ ట్రోల్ చేస్తున్న వారిపై కూడా ఫరియా సానుకూలంగా స్పందించడం గమనార్హం. తనను ద్వేషించేవారికి కూడా ప్రేమనే పంచుతానని, వారి మంచి కోసమే ప్రార్థిస్తానని ఆమె పేర్కొంది. ‘అల్లా’ అంటే అర్థం తనకు తెలుసని, సర్వాంతర్యామి అని, అందరినీ ఏకం చేసే దివ్య వెలుగు అని ఫరియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ, పెద్ద చర్చకు దారితీసింది. మతాలకంటే మానవత్వం, ప్రేమ, ఐక్యతలే ముఖ్యమంటూ ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలను చాలామంది సమర్థిస్తున్నారు. కాగా, ఫరియా అబ్దుల్లా నటించిన ‘సిగ్మా’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఇటీవల తెలంగాణ సంప్రదాయ పండుగైన బోనాల ఉత్సవాల్లో పాల్గొనడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఇటీవల తెలంగాణ (Telangana) సంప్రదాయ పండుగైన బోనాల ఉత్సవాల్లో (Bonalu Festival) పాల్గొనడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటోన్న విషయం తెలియంది కాదు. ఒక వర్గం నెటిజన్లు ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేయడంతో, వీటన్నింటికీ సమాధానమిస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ అవుతూ ఓ వీడియోను పంచుకున్నారు. కన్నీటి పర్యంతమవుతూ ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఈ వీడియోలో ఫరియా మాట్లాడుతూ.. ‘‘మా నాన్నగారు ఇస్లాం మతాన్ని ఇష్టపడి అందులోకి మారారు. ఒక మతంలోని మంచిని చూసి స్వీకరించిన వ్యక్తి నన్ను పెంచినప్పుడు, నా పెంపకం ఎలా ఉంటుంది? నేను ఎప్పుడూ ఇస్లాంలో ఉన్న మంచి భావనలనే చూస్తూ పెరిగాను. నన్ను ద్వేషిస్తూ, కాఫిర్ అని, తప్పు చేస్తున్నావని తిడుతున్న వారికి కూడా నేను మంచి జరగాలనే కోరుకుంటున్నాను. నాకు ప్రకృతిలోని చెట్లు, రాళ్ళు, సీతాకోకచిలుకలు.. ఇలా ప్రతి అణువులోనూ ప్రాణం, దైవత్వం కనిపిస్తాయి’’ అని భావోద్వేగానికి గురయ్యారు. (Faria Abdullah Emotional Video) చిన్నతనంలో తాను ‘అల్లాహ్’ అంటే ఏమిటని తల్లిని అడిగినప్పుడు, ‘అల్లాహ్ అంటే వెలుగు.. అంతటా, ఎల్లప్పుడూ నిండి ఉండే ఒక దివ్యశక్తి’ అని చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు. అలాంటప్పుడు ప్రతిదానిలో ఉండే దైవాన్ని ఎలా వేరుచేసి చూడగలమని ఆమె ప్రశ్నించారు. ‘‘నేను ప్రేమ, శాంతి, ఐక్యత కోసం మాత్రమే ప్రార్థిస్తాను. నాపై ద్వేషం చూపిస్తున్న వారికి కూడా నా ప్రేమనే పంపుతాను’’ అని ఫరియా స్పష్టం చేశారు. మతపరమైన హద్దులు లేకుండా అన్ని సంస్కృతులను గౌరవించే తన దృక్పథాన్ని ఆమె ఈ వీడియో ద్వారా పంచుకోవడంతో పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. SYG: సంక్రాంతి

సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటారు. కొందరు దీన్ని చూసిచూడనట్లు వదిలేస్తారు. మరికొందరు మాత్రం మనసులోకి తీసుకుని తెగ బాధపడిపోతుంటారు. ఇప్పుడు అలానే 'జాతిరత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కన్నీళ్లు పెట్టుకుంది. బోనాల్లో పాల్గొన్నందుకు తనని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని చెబుతూ గుక్కపెట్టి ఏడ్చేసింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన బోనాల పండుగలో ఫరియా సందడి చేసింది. వేరే మతం అయినప్పటికీ హిందూ మహిళలతో కలిసి బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొంది. పోతురాజులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ కూడా చేసింది. అయితే ఇదంతా చూసిన కొందరు ముస్లిం నెటిజన్లు.. ఫరియాని 'కాఫిర్' అని, మతానికి మచ్చ తెస్తోందని కామెంట్లు చేశారు. ఈ విమర్శలపై స్పందించిన ఫరియా ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. 'నా తండ్రి ఇస్లాం మతాన్ని ఇష్టపడి ఇందులోకి మారారు. ఇస్లాం మతంలోని మంచి విషయాలన్నింటినీ నాకు చూపిస్తూ ఆయన నన్ను పెంచారు. నేను కూడా ఇస్లాంలో ఎప్పుడూ మంచినే చూశాను. మీరు కూడా మంచినే చూడాలని కోరుకుంటున్నాను బ్రో. నేను తప్పు చేస్తున్నానని, నేను కాఫిర్ అని అంటున్న ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను' 'నేను చెట్టు, రాయి, సీతాకోకచిలుక.. ఇలా ప్రతిదానిలోనూ జీవాన్ని చూస్తాను. అది మీకు అద్భుతంగా అనిపించకపోతే, దాని వల్ల దేవుడిపై మీ నమ్మకం పెరగకుండా దేవుడికి దూరమవుతున్నట్లయితే. మీరు దేవుడిని తప్పు మార్గంలో వెతుకుతున్నారని అర్థం. మీరు కలిసే ప్రతి మనిషిలో దేవుడిని చూడలేకపోతే కూడా మీరు తప్పు మార్గంలో ఉన్నట్టే. నేను ప్రేమ కోసం ప్రార్థిస్తాను. ఐక్యత కోసం ప్రార్థిస్తాను. శాంతి కోసం ప్రార్థిస్తాను. ఇకపైనా అలానే చేస్తాను. నాపై ద్వేషం చూపించే వారికి కూడా నేను మరింత ప్రేమని పంచుతాను. వారి మంచి కోసం ప్రార్థిస్తాను' 'నా మససు మంచిదని నాకు తెలుసు. నేను ప్రేమని అనుభవించాను. మంచితనాన్ని

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో ఈ మధ్య వరుసగా తిరుగుబాట్లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తున్న ఇక్కడి ప్రజలు బలూచిస్తూనే తరహాలో స్వాతంత్రం కావాలంటున్నారు. భారత్ అనుమతిస్తే విలీనం అయిపోయేందుకు కూడా సిధ్దమంటున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఇవాళ సంచలన విషయం బయటపెట్టారు.NALSAR-CJI Row: హైదరాబాద్ నల్సార్ విద్యార్థులపై సీజేఐ కీలక ఆదేశాలు..! నిరసనలపై..!కేంద్రం 2019లో జమ్ము కాశ్మీర్ కు రాష్ట్ర హోదా రద్దు చేయడంతో పాటు మూడు ముక్కలు చేసి , రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం గతంలో కల్పించిన ప్రత్యేక హోదాను సైతం రద్దు చేసింది. దీంతో కాశ్మీర్ లో ఉగ్రవాదం ఉండదని చెప్పుకుంది. కానీ ఇప్పటికీ అక్కడ పహల్గాం వంటి ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయలో పీఓకే ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం 2019లో ఆ నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే ఇప్పటికే వారు కాశ్మీర్ లో విలీనం అయిపోయేవారని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ పేర్కొన్నారు. నల్సార్ కు బార్ కౌన్సిల్ సారీ చెప్పాల్సిందే..! సీజేఐకి మరో లా యూనివర్శిటీ షాక్..!కేంద్రం ఆ నిర్ణయాలు తీసుకోకపోతే.. ఇప్పటికి వారంతా తిరిగి జమ్మూ కాశ్మీర్ లో విలీనం కోసం ఉద్యమాలు చేసేవారని ఒమర్ తెలిపారు. ప్రస్తుతం పీఓకేలో నెలకొన్న పరిస్థితులు, 1947లో పాకిస్థాన్ నుంచి వచ్చిన గిరిజన దండయాత్రలను ఎదుర్కొని, భారత్‌లో విలీనానికి జమ్మూ కశ్మీర్ ప్రజలు తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.పీఓకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆందోళన చేస్తున్న ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం, అరెస్టులకు గురవడం తనను బాధించిందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. తన తాత, జమ్మూ కశ్మీర్ తొలి ప్రధానమంత్రి షేక్ మహ్మద్ అబ్దుల్లాను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. 1947లో పాకిస్థాన్ నుంచి వచ్చిన శత్రువుల్ని ఎదుర్కొని, భారత సైన్యం కశ్మీర్‌కు చేరుకునే ముందే ప్రజలను సమీకరించి

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) పరిస్థితులపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) పరిస్థితులపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర హోదాను 2019లో రద్దు చేయకపోయి ఉంటే.. ఇప్పుడు పీవోకే ప్రజలు జమ్మూకశ్మీర్‌లో తిరిగి విలీనం కావాలని కోరుతూ ఉద్యమించేవారని ఆయన అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు (Omar Abdullah PoK). పీవోకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆందోళన చేస్తున్న ప్రజలపై జరుగుతున్న పరిణామాలు తనను బాధిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అక్కడ పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడి జైలుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. 1947లో పాకిస్థాన్ నుంచి వచ్చిన ఆక్రమణదారులను ఎదుర్కొన్న కశ్మీరీ ప్రజలను ఒమర్ అబ్దుల్లా గుర్తుచేసుకున్నారు. తన తాత, జమ్మూకశ్మీర్ తొలి ప్రధానమంత్రి షేక్ మహ్మద్ అబ్దుల్లా నేతృత్వంలోని కశ్మీరీలు ఆక్రమణదారులను ఎదుర్కొన్నారని చెప్పారు (J&K statehood Article 370). భారత సైన్యం కశ్మీర్‌కు చేరుకోవడానికి ముందే స్థానిక ప్రజలు తమ ప్రాంతాన్ని రక్షించేందుకు పోరాడారని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. 2019లో జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదాను రద్దు చేయకపోయి ఉంటే.. ఈ రోజు పీవోకే ప్రజలు జమ్మూకశ్మీర్‌లో తిరిగి విలీనం కావాలని కోరుతూ ఉద్యమించేవారని అన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పీవోకేకు సంబంధించిన స్థానాలను ఖాళీగా ఉంచామని, ఏదో ఒక రోజు అవి భర్తీ అవుతాయని ఆశిస్తున్నామని తెలిపారు (Omar Abdullah PoK statement). జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను, ఇతర రాజ్యాంగపరమైన హామీలను పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తుందని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాగా, ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందిన నూతన చిత్రం అగధ శుక్రవారం ప్రేక్షకుల ఎదుటకు వచ్చేసింది. ఎమ్మెస్ రాజు.. 'అగధ' మూవీ రివ్యూ! Agadha Movie Review ఎం.ఎస్.రాజు (M.S. Raju) సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. బ్లాక్ బస్టర్స్ తీసిన నిర్మాత. అయితే దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన చిత్రాలు మాత్రం ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేదు. నిర్మాతగా కంటే దర్శకుడిగా వైవిధ్యమైన చిత్రాలను అందించడానికి ఆసక్తి చూపించే ఎమ్మెస్ రాజు తాజాగా మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ గా 'అగధ' (Agadha) మూవీని రూపొందించారు. 'పొలిమేర'తో నటిగా చక్కని గుర్తింపు పొందిన కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) కీలక పాత్ర పోషించిన 'అగధ' ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో తెలుగులో స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తున్నాయి. 'అగధ' కూడా అలాంటి మిస్టికల్ స్పిరిట్ రిలేటెడ్ మూవీనే. కాకపోతే దీని నేపథ్యం ఉత్తరాంధ్ర అవతల ఉన్న బస్తర్ సమీప గ్రామాలతో ముడిపెట్టింది. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు గ్రామంలో ఉండే మహాదేవి (కామాక్షి భాస్కర్ల) దెయ్యం పట్టిన వారిని మామూలు మనుషులను చేస్తుంటుంది. ఆమె గురించి తెలుసుకోవడానికి సిటీ నుంచి మానస (శ్రేయరాణి), సంజయ్ (రోషన్) వెళ్తారు. వాళ్ళకు తన గతాన్ని చెప్పిన మహాదేవి అదే సమయంలో తన కుటుంబం ఆపదలో ఉన్న విషయాన్ని గ్రహిస్తుంది. తన బాబాయ్ (భానుచందర్) కూతురు మహిమ (ఉల్కా గుప్తా) గర్భవతిగా ఉండి, ఆత్మహత్య చేసుకున్న విషయం మహాదేవికి తెలుస్తుంది. ఆ ఇంటిలో మరికొన్ని ఆత్మలు ఉన్నాయనే సంగతి ఆమెకు అక్కడికి వచ్చాక అర్థమౌతుంది. మహిమ ఆత్మహత్య వెనుక కలి నుంచి ఉద్భవించిన ఘోర క్షుద్రశక్తి 'అగధ' ఉందనే విషయం మహాదేవి గ్రహిస్తుంది. మహిమ ప్రియుడు సింహా (శ్రవణ్‌రెడ్డి) ఆచూకీ లేకపోవడానికి, వారి స్నేహితుడు బబ్లూ (వైవా రాఘవ) కిరాతక హత్యకు, తదనంతరం మహిమ ఆత్మహత్యకు 'అగధ' కారణమని మహాదేవి

యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా, దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం సిగ్మా (Sigma). యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishna) కథానాయకుడిగా, దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం సిగ్మా (Sigma). లైకా ప్రొడక్షన్స్, జేఎస్జే మీడియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఓలమ్మో వగలాడీ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. సంగీత దర్శకుడు థమన్ ఎస్ అందించిన మాస్ అండ్ క్యాచీ బీట్స్‌కి తగ్గట్టుగా రచయిత కృష్ణ చైతన్య అలరించే సాహిత్యాన్ని అందించాడు. వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా, సంజన దివాకర్ కల్మంజేలతో కలిసి ఈ పాటను తమదైన శైలిలో ఆలపించారు. పాటలో సందీప్ కిషన్ మాస్ స్టైలిష్ లుక్స్‌తో మెరవగా, కథానాయిక ఫరియా అబ్దుల్లా తన గ్లామర్ తో అదరగొట్టేసింది. తొలి చిత్రంతోనే జేసన్ సంజయ్ తన మేకింగ్ స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ఈ సాంగ్‌ను విజువల్‌గా చాలా రిచ్‌గా తెరకెక్కించాడు. థమన్ అందించిన ఎనర్జెటిక్ మ్యూజిక్, నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. విజయ్ కుమారుడు కావడంతో అటు తమిళ్ లో ఇటు తెలుగులో సిగ్మా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో జేసన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడా.. లేదా అనేది చూడాలి
హైదరాబాద్‌లో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఆషాఢ మాస చివరి ఆదివారం కావడంతో భాగ్యనగరంలో బోనాల పండగ వాతావరణం అంబరాన్ని తాకింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సందడి చేశారు. ఆలయం బయట డప్పు చప్పుళ్లకు డాన్స్ చేసి భక్తుల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్చర్ గురించి చెబుతూ ఫరియా ఎమోషనల్ అయ్యారు.పాతబస్తీలోని ప్రసిద్ధ మీరాలంమండి మహంకాళేశ్వర ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు ఫరియా అబ్దుల్లా అతిథిగా హాజరయ్యారు. బోనం ఎత్తుకొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పోతురాజుల విన్యాసాలు, డప్పు చెప్పుల మధ్య ఫరియా మాస్ డాన్స్ చేసి భక్తులను ఉత్సాహపరిచారు. బోనాల వేడుకల్లో ఫరియా డాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఫరియా అబ్దుల్లా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్పదని ప్రశంసించారు. ఎలాంటి భేషజాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటారని కొనియాడారు. హైదరాబాద్ సంస్కృతిలో భాగమైనందుకు తనకెంతో గర్వంగా ఉందన్నారు. ''తెలంగాణ కల్చర్ అంటే ఇలానే ఉంటుంది. అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. కలిసి మెలిసి ఉంటారు. ఇలాగే ఉండాలి.అదే బెస్ట్'' అంటూ ఫరియా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.\ఫరియా అబ్దుల్లా పక్కా హైదరాబాదీ అమ్మాయి. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ముస్లిం ఫ్యామిలీలో జన్మించారు. లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు. ఆ సమయంలో 'నక్షత్ర' అనే షాట్ నటించారు. కాలేజీలో జరిగిన ఒక ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ దృష్టిలో పడి సినిమా ఛాన్స్ అందుకున్నారు. 'జాతిరత్నాలు' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. చిట్టిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫరియా

ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల వేడుక సందడిగా జరిగింది. పలు దేవాలయాల్లో టాలీవుడ్ సెలబ్రిటీలైన విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా తదితరులు కనిపించారు. ఇక మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో 'జాతిరత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాల్గొంది. తీన్మార్ డ్యాన్స్ చేసి అలరించింది. అలానే తెలంగాణ కల్చర్ గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. (ఇదీ చదవండి: 'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం) 'చాలా కొత్తగా ఉంది. తెలంగాణ కల్చర్ అంటే ఇలానే ఉంటది. అందరినీ అంగీకరిస్తారు. అందరితో కలిసి ఉంటారు. అది బెస్ట్' అని ఫరియా భావోద్వేగానికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే పోతురాజులతో కలిసి ఆకట్టుకునే డ్యాన్స్ కూడా చేసింది. ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. వేరే మతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ బోనాల్లో పాల్గొని ఫరియా మతసామరస్యం చాటుకుంది. కెరీర్ విషయానికొస్తే.. జాతిరత్నాలు తర్వాత బంగార్రాజు, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి, గాయపడ్డ సింహం చిత్రాల్లో నటించింది. (ఇదీ చదవండి: నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా': హీరోయిన్ దుషార) 'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు) హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) అతని మీద ఎలాంటి కేసు పెట్టారంటే.. చింతాడ రవి అరెస్ట్ పై సంచలన నిజాలు పేపర్ లీక్ కావడంతో మనస్థాపానికి గురై మేఘన ఆత్మహత్య మా ఇంటి ఏకైక డాక్టర్.. చివరి ఫోన్‌కాల్ గుర్తుచేసుకుని కన్నీళ్లు అంత మొగోడివా నువ్వు... దమ్ముంటే జైల్లో పెట్టించు చూస్తా.. బంగారం ధరలకు బ్రేక్.. వారం తరువాత భారీగా పతనం

Sachin vs Abdul Qadir 28 Runs in an Over: పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ 16 ఏళ్ల సచిన్ టెండూల్కర్‌ను మైదానంలో బహిరంగంగా రెచ్చగొట్టాడు. నోటితో ఒక్క మాట మాట్లాడకుండా కేవలం బ్యాట్‌తోనే సచిన్ సమాధానమిచ్చాడు. ఒకే ఓవర్లో ఏకంగా 28 పరుగులు పిండుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ చారిత్రాత్మక ఘట్టం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయింది. 1989వ సంవత్సరంలో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో కేవలం 16 ఏళ్ల పసికూనగా మైదానంలోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ పట్ల పాక్ బౌలర్లు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. అనుభవం లేని కుర్రాడని భావించి మాటలతో సవాల్ విసిరే ప్రయత్నం చేశారు. ఒక ప్రదర్శన మ్యాచ్‌లో సచిన్ క్రీజులోకి వచ్చినప్పుడు పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ బౌలింగ్ చేస్తున్నాడు. అప్పటికే తన అద్భుతమైన షాట్లతో ముస్తాక్ బౌలింగ్‌ను సచిన్ చీల్చి చెండాడాడు సచిన్. ముస్తాక్ అహ్మద్‌పై మూడో బంతికి సిక్సర్ల వర్షం.. కేవలం మూడు బంతుల్లోనే 16 పరుగులు రాబట్టి సచిన్ తన రాకను ఘనంగా చాటుకున్నాడు. ముస్తాక్ అహ్మద్‌ను ఒక పసిపిల్లవాడు దంచికొట్టడం చూసి పాకిస్తాన్ దిగ్గజ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ తట్టుకోలేకపోయాడు. నేరుగా సచిన్ వద్దకు వచ్చి మానసికంగా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాడు. "చిన్నోడా, ఆ కుర్రాడి బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం పెద్ద విషయమేమీ కాదు. ధైర్యముంటే నా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి చూడు. వెంటనే స్టార్ అయిపోతావ్" అంటూ సచిన్‌కు బహిరంగంగా సవాల్ విసిరాడు. మైదానంలో ప్రత్యర్థి క్రీడాకారులు ఎంత రెచ్చగొట్టినా సచిన్ ఏమాత్రం చలించలేదు. నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రానివ్వలేదు. శాంతంగా బ్యాట్ పట్టుకుని తర్వాతి ఓవర్ కోసం సిద్ధమయ్యాడు. ఒకే ఓవర్లో 28 పరుగులు.. ఖాదిర్ నోట మాట రాలేదు! అబ్దుల్ ఖాదిర్ తర్వాతి ఓవర్ వేసేందుకు బంతిని చేతిలోకి తీసుకున్నాడు. తొలి

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆ సంస్థ సీనియర్ కమాండర్ అయిన ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్‌లోని ఖుబా మసీదు వద్ద అకస్మాత్తుగా కుప్పకూలి మరణించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆ సంస్థ సీనియర్ కమాండర్ అయిన ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్‌లోని ఖుబా మసీదు వద్ద అకస్మాత్తుగా కుప్పకూలి మరణించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అతడి మరణానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు (Lashkar Commander Death). ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లే ముందు అబ్దుల్ అజీజ్ ఓ రెస్టారెంట్లో భోజనం చేసినట్లు సమాచారం. అనంతరం ఇస్లామాబాద్‌లోని ఖుబా మసీదుకు చేరుకున్న ఆయన.. ప్రవేశ ద్వారం వద్ద అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు ఏం జరిగిందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. విషప్రయోగం జరిగిందా, అనారోగ్యంతో మరణించాడా లేదా మరేదైనా కారణమా అన్నది అధికారికంగా వెల్లడికాలేదు (Lashkar-e-Taiba Pakistan). అబ్దుల్ అజీజ్ లష్కరే తోయిబాలో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. జమ్ము, కశ్మీర్లో ప్రవేశించే ఉగ్రవాదులకు సేఫ్‌హౌస్‌లు, ఆర్థిక సహాయం, తప్పుడు పత్రాలు సమకూర్చడం వంటివి చేస్తుంటాడు. నీలమ్ వ్యాలీ, ముజఫరాబాద్ మీదుగా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపుతుంటాడు. అలాగే ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా సంస్థ తరఫున చేస్తుంటాడు (Pakistan Terrorist Deaths). కాగా, ఇటీవలె లష్కరే తోయిబాకు చెందిన కీలక నేత రిజ్వాన్ హనీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు (Unknown Gunmen Pakistan). గత మూడేళ్లలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో లష్కరే తోయిబాకు చెందిన 30 మందికి పైగా సభ్యులు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమైనట్లు వెల్లడించాడు. ఈ హత్యలకు భారత నిఘా వర్గాలే కారణమని హనీఫ్