
అన్నదానాలతోప్రచారం చేసి.. రూ.50 కోట్లు సాధించి
పాన్ఇండియా రేంజులో ఆర్భాటంగా విడుదలవుతున్న సినిమాలు అంచనాలను అందుకోలేక చతికిలపడుతున్న తరుణంలో, ఓ చిన్న సినిమా అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రచారానికి కూడా బడ్జెట్ లేక సైలెంటుగా విడుదలైన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అది సాధిస్తున్న విజయం చూసి బాలీవుడ్ సైతం నివ్వెరపోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? దాని ప్రత్యేకతలేంటి? ఆగస్టు 7న ఏమాత్రం హడావుడి లేకుండా విడుదలైంది ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). స్టార్లుగానీ, తెలిసిన ముఖాలుగానీ లేని ఆ సినిమాకు తొలిరోజు వసూళ్లు.. కేవలం రూ.10 లక్షలు. ఓపెనింగే ఇంత డల్‌గా ఉంటే ఇంకేం ఆడుతుంది అనుకున్నారంతా. తొలివారంలో రూ.1కోటి 8లక్షలు వసూలు చేసింది. రెండో వారం మరింత దయనీయం. రూ.40లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక దీని పనైపోయినట్లే, బొమ్మ తీసేయడమే తరువాయి అని అనుకున్నారు. కానీ అప్పుడే అద్భుతం జరిగింది. తొలి 14 రోజుల్లో రూ.1.48 కోట్లు వసూలు చేసిన ఆ సినిమా, ఒక్క మూడో వారంలోనే ఏకంగా రూ.10.4 కోట్లు రాబట్టింది! నాలుగో వారంలో ఈ సినిమా దూకుడు చూసి ట్రేడ్ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. 22వ రోజు రూ.6.25 కోట్లు, 23వ రోజు రూ.9.25 కోట్లు, 24వ రోజు రూ.12.75 కోట్లు.. ఇలా రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తొలి రెండు వారాల మొత్తం కలెక్షన్ల కన్నా, 24వ రోజు వచ్చిన వసూళ్లే ఎక్కువంటే, ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థమవుతోంది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.47.33 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రూ.50 కోట్లకు చేరువవుతోంది. ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ తీస్తే రూ.200 కోట్లొచ్చాయ్..! 1900-1973 మధ్య జీవించిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా(మహరాజ్జీ) జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను విశాల్ చతుర్వేది తెరకెక్కించారు. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రచారానికి కూడా డబ్బుల్లేక
