
సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం
అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. అక్షర ఆంధ్రలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేశ్ ఈరోజు (మంగళవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. 2027 సెప్టెంబర్‌కు వందశాతం అక్షరాస్యత లక్ష్యమని ఉద్ఘాటించారు. ఏడాదిలో 25 లక్షల మంది అక్షరాస్యులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఏపీని అభినందించిందని అన్నారు. రాష్ట్ర అక్షరాస్యత 72.6శాతం నుంచి 82.1శాతానికి పెరిగిందని అధికారులు వివరించారు. 2027 మార్చిలో మరో 25 లక్షలు.. సెప్టెంబర్‌కు మరో 27 లక్షల మందికి అక్షరాస్యత కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూళ్లలో చేర్చాలి.. 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అక్షరాస్యత ఉద్యమం కొనసాగుతోందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూల్లో చేర్పించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఇంకా 1,64,821 మంది బడిబయట పిల్లలు ఉన్నారని.. వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ ఏడాది 33 వేల మంది బడిబయట పిల్లలను స్కూల్లో విద్యాశాఖ చేర్చిందని వివరించారు. లీప్ యాప్ ద్వారా మిగిలిన పిల్లల వివరాలు ప్రధానోపాధ్యాయులకు అందించాలని నిర్ణయించామని అన్నారు. ఉపాధ్యాయుల హాజరు 98.97శాతం.. విద్యార్థుల హాజరు 85.41శాతం ఉందని వివరించారు. మూడు రోజులు వరుసగా గైర్హాజరైతే తల్లిదండ్రులను