
'KGF 2' లాంటి భారీ విజయం సాధించిన దాదాపు నాలుగేళ్ల తర్వాత, రాకింగ్ స్టార్ యశ్ తిరిగి సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నాడు. అతను నటించిన 'టాక్సిక్' సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో యశ్ తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓవర్సీస్ లో టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా శుక్రవారం (ఆగస్టు 21) నుంచి ఇండియాలోనూ టాక్సిక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రేక్షకులు ఈ మూవీ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఎగబడుతున్నారు. ప్రస్తుతం, బుక్‌మైషో యాప్‌లో ప్రతి గంటకు 21.71 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. ఆశ్చర్యకరంగా ఢిల్లీ, ముంబై వంటి నార్త్ సిటీల్లోనూ టాక్సిక్ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో యశ్ సినిమా టికెట్ల ధరలు ఎలా ఉన్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో సాధారణ టికెట్ ధర రూ. 400 నుంచి ప్రారంభమయ్యింది. అలాగే ఎగ్జిక్యూటివ్, ప్రీమియం టికెట్స్ ధర రూ.450లుగా ఉంది. ఇక ప్రీమియం టికెట్ ధరలు రూ.500 పలుకు తుండగా, కొన్ని నగరాల్లో రీక్లైనర్ సీట్స్ రేటు రూ. 1000కు పైగానే ఉంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీలో కొన్ని ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు ఏకంగా రూ.2,600 వరకు ఉండవచ్చని తెలుస్తోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. టాక్సిక్ టికెట్ ధరల పెంపుపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులోకి రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 6 గంటల ప్రత్యేక షోలకు టికెట్ ధరలు రూ.500–600 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. సాధారణ షోల టికెట్ ధరలు కూడా సాధారణ ధరల కంటే రూ.50–100 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్స్టర్ మైండ్స్ సంస్థలు సంయుక్తంగా టాక్సిక్ చిత్రాన్ని నిర్మించాయి. యశ్ సరసన కియారా అద్వానీ ప్రధాన కథానాయికగా జత కట్టింది. అలాగే నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి అందాల తారలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ సహా పలువురు విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇవాళ (ఆగస్టు 22) సాయంత్రం హైదరాబాద్ వేదికగా టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది.
Smashing it out of the park - All Together! 🎟🔥#ToxicTheMovie Nationwide Bookings are now Open!💥 — KVN Productions (@KvnProductions) August 21, 2026 మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





