
© 2026 nimisham.in


Toxic : కెజిఎఫ్ సినిమా తర్వాత యశ్ హీరోగా భారీ అంచనాలతో రిలీజయిన టాక్సిక్ సినిమా మొదటి ఆట నుంచే ఫుల్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అసలు ఏ ఎమోషన్ పండకుండా కేవలం యాక్షన్, రొమాన్స్ సీన్స్ తోటి భారీ సెట్టింగ్స్ వేసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోకి చంపడం, హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం అన్న పని ఒక్కటే ఉన్నట్టు కథని నడిపించారు. ఉన్న ఎమోషన్ పండలేదు, స్క్రీన్ ప్లే క్లారిటీ లేదు. దీంతో ఈ సినిమా అన్ని భాషల్లో ఫ్లాప్ అయింది.
కాకపోతే ఈ సినిమాకు భారీ హైప్ ఉండటంతో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు కేవలం 350 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకు ఓటీటీ డీల్ ఇంకా అవ్వలేదు. నిర్మాతలు సినిమా మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని గతంలోనే ఓ ఓటీటీ సంస్థ 150 కోట్లు ఆఫర్ చేస్తే వద్దన్నారట. రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ అవుతుంది, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని మూవీ యూనిట్ ఆశపడ్డారు. కానీ సినిమా బోల్తా కొట్టడంతో ఇప్పుడు టాక్సిక్ సినిమాకు కేవలం 30 కోట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నారట.




