
Aug 15 2026 5:53 AM | Updated on Aug 15 2026 5:53 AM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధానిలో తాత్కాలిక సచివాలయం వెనుక 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ అభివృద్ధి
రూ.6.68 కోట్లకు పనులు దక్కించుకున్న ఎన్సీసీ
ఆర్నెల్లు తిరక్కముందే మెరుగుపర్చే పనులకు టెండర్
ఆ పనులను రూ.3.30 కోట్లకు దక్కించుకున్న ఎన్సీసీ
పరేడ్ గ్రౌండ్‌కే రూ.9.98 కోట్లు వ్యయం చేయడంపై సర్వత్రా విస్మయం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ దుబారాకు ఇదో నిలువెత్తు నిదర్శనం..! జనవరిలో రాజధాని పరేడ్ గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశం, అప్రోచ్ రోడ్లు సిద్ధం చేసేందుకు రూ.6.68 కోట్లు వ్యయం చేసింది. ఆర్నెల్లు తిరక్కముందే పరేడ్ గ్రౌండ్‌ను మెరుగుపర్చే పనులకు రూ.3.30 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ రెండు పనులను టెండర్ ద్వారా ఒకే సంస్థ ఎన్‌సీసీకే కట్టబెట్టడం గమనార్హం. పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసేందుకు, మెరుగుపర్చేందుకు రూ.9.98 కోట్లు వ్యయం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించేది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలను రాజధాని ప్రాంతంలో నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.
తాత్కాలిక సచివాలయం వెనుక 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశం, అప్రోచ్ రోడ్ల ఏర్పాటుకు రూ.6,58,07,360 అంచనాతో సీఆర్డీఏ ద్వారా టెండర్ పిలిచింది. రూ.6,68,27,374.08 కోట్‌చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థకు ఆ పనులను కట్టబెట్టింది. ఆ గ్రౌండ్‌లోనే జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించింది. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశాలను మెరుగుపర్చే పనులకు రూ.3,17,96,335 అంచనాతో జూలై 10న సీఆర్డీఏ ద్వారా టెండర్ పిలిచింది. ఈ టెండర్లోనూ రూ.3,30,61,829.13 కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్‌కు ఆ పనులను కట్టబెట్టింది. అంటే.. పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేసిన ఆర్నెల్లకే దాన్ని మెరుగుపర్చే పనులను రూ.3.30 కోట్లకు అప్పగించడంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి.
అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
వెకేషన్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)
'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)
మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)
హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)
రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ
ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్
నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్
Recommended for you
Found this helpful?
Share this story with your network










