ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'స్పిరిట్'. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కాస్టింగ్, ప్రత్యేక పాత్రలపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సినిమాలో ఒక కీలక పాత్ర గురించి వస్తున్న వార్తలకు నిర్మాతల వైపు నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది. చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. గతంలో వచ్చిన టీజర్లో ఆయన వాయిస్ ఓవర్ వినిపించడంతో, ఈ భారీ కాప్ యాక్షన్ డ్రామాలో ఆయన ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారని ప్రచారం జరిగింది.
అయితే కథనంలో ఉన్న ఒక పవర్ ఫుల్ జైలర్ పాత్ర కోసం ముందుగా ప్రకాష్ రాజ్‌ను సంప్రదించిన మాట వాస్తవమే అని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదని ప్రణయ్ వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారంటూ వస్తున్న వార్తలకు అధికారికంగా బలం చేకూరినట్లయింది.
ఇక ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యామియో చేయనున్నారని సాగుతున్న ప్రచారానికి కూడా ప్రణయ్ ముగింపు పలికారు. 'స్పిరిట్' లో చిరంజీవి ఎలాంటి అతిథి పాత్ర చేయడం లేదని తేల్చి చెప్పారు. కాస్టింగ్ పరంగా క్లారిటీ రావడంతో ప్రస్తుతం ఈ వివరాలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన విజయాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో 'స్పిరిట్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో ప్రభాస్ తొలిసారిగా పూర్తిస్థాయి రోషకలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండడం మెగా మాస్ ఎలిమెంట్స్‌ని పెంచేస్తోంది.
నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుండి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. సందీప్ వంగా మేకింగ్ టేస్ట్ ప్రకారం ప్రకాష్ రాజ్ ప్లేస్‌లోకి వచ్చే కొత్త నటుడు ఎవరుంటారోననే కుతూహలం ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.
త్వరలోనే ఈ మూవీలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల అధికారిక వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Irumudi Movie Review In Telugu: ఇరుముడి మూవీ రివ్యూ
లోకేష్ కనకరాజ్ మాస్ ర్యాంపేజ్: 100 కోట్ల క్లబ్లో 'DC' మూవీ.!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.




