
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
MYSAA Teaser: వెండితెరపై ఇప్పటి వరకు గ్లామరస్ పాత్రలతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. తొలిసారిగా మునుపెన్నడూ చూడని అత్యంత రౌద్ర రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె ప్రధాన పాత్రలో దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న విభిన్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ (MYSAA). అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని, నవంబరు 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆదివారం రిలీజ్ చేసిన ‘మైసా’ టీజర్ సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేస్తోంది. టీజర్ ఆద్యంతం గూస్బంప్స్ తెప్పించే విజువల్స్, నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో నిండిపోయింది. ఇందులో రష్మిక అత్యంత శక్తిమంతమైన గిరిజన గోండు మహిళ పాత్రలో కనిపించి అందరి మైండ్ బ్లాంక్ చేసింది. ముఖమంతా రక్తపు మరకలు, చేతిలో ఆయుధాలు పట్టి శత్రువులపై విరుచుకుపడుతున్న ఆమె యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. యుద్ధానికి ఆయుధం అంటే భయం కానీ.. ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు.. అంటూ వచ్చిన డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి. నేచురల్ లుక్‌తో పాటు, కళ్లలోనే పగ, ఆవేశం నింపుకుని ఆమె పలికించిన హావభావాలు నటనకు సరికొత్త నిర్వచనంగా నిలిచాయి. క్లైమాక్స్ స్థాయి యాక్షన్ మూమెంట్స్‌తో టీజర్ మొత్తం హై-వోల్టేజ్ వైబ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ సమకూర్చిన నేపథ్య సంగీతం టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి షాట్‌ను ఎలివేట్ చేస్తూ ఆయన ఇచ్చిన స్కోర్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. గిరిజన సంస్కృతి, వారి పోరాటాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రష్మిక కెరీర్లోనే ఓ ల్యాండ్‌మార్క్ మూవీగా నిలవనుందని టీజర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. కమర్షియల్ హంగులతో పాటు బలమైన స్టోరీతో వస్తున్న ‘మైసా’ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: NTV Telugu లో చూడండి