
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టుల లైనప్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ షూటింగ్లో బిజీగా ఉన్న తారక్.. ఆ తర్వాత కొరటాల శివతో చేయాల్సిన ‘దేవర 2’ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తిస్థాయిలో కొలిక్కి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న పౌరాణిక విజువల్ వండర్‌కు ఎన్టీఆర్ లైన్ క్లియర్ చేశారు. దేవసేనాపతి మురుగన్ నేపథ్యంలో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.





