
ఒకప్పుడు హీరోలకు సమాంతరంగా హీరోయిన్లకు మంచి పాత్రలు దక్కేవి. విజయశాంతి, రమ్యకృష్ణ, సౌందర్య, అనుష్క శెట్టి, నయనతార అలా లేడి సూపర్ స్టార్లుగా ఎదిగారు. బాలీవుడ్ లో కూడా శ్రీదేవి, మాధురీ దీక్షిత్ కమర్షియల్ సినిమాల్లో సూపర్ స్టార్లుగా ఎదిగితే ఆర్ట్ సినిమాల్లో షబానా అజ్మీ, స్మిత పాటిల్ వంటివారు పేరు గడించారు. కానీ ఇప్పుడు హీరోయిన్లను మరీ కూరలో కరివేపాకులా చేస్తున్నారు.
ఇక హీరోయిన్లకే ప్రాధాన్యమున్న పాత్రలు దక్కనప్పుడు మా లాంటి ఆంటీలకు మంచి రోల్స్ ఎలా వస్తాయి అని ప్రశ్నిస్తున్నారు దియా మీర్జా.
ఆమెకి 45 ఏళ్ళు. ఒకప్పుడు హీరోయిన్ గా, అందాల పోటీలో విజేతగా, మోడల్ గా హల్చల్ చేసింది. ఇప్పుడు హీరోయిన్ పాత్రలు కోరుకోవడం లేదు కానీ ఆంటీ రోల్స్ లో కూడా బలమైన క్యారెక్టర్లు కావాలి అని కోరుకుంటోంది. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్ చేస్తోంది. తాజాగా Operation Safed Sagar అనే నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ప్రమోట్ చేస్తోంది.
“నేను పాత్రలను ఎంచుకోను, కథలను ఎంచుకుంటాను. కథే అత్యంత ముఖ్యమని నా అభిప్రాయం,” అని ఆమె పేర్కొంది.
హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన దియా నాగార్జున సరసన “వైల్డ్ డాగ్” ఛితంలో నటించారు. ఆమె నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రం అది.





