
Aug 17 2026 8:45 PM | Updated on Aug 17 2026 9:11 PM
ఢిల్లీకి చెందిన ఓ వ్యవస్థాపకుడు దుబాయ్‌లో రూ.36 లక్షల వార్షిక జీతంతో వచ్చిన ఉద్యోగ ఆఫర్‌ను వదులుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. 7 ఏళ్లు గడిచినా ఆ నిర్ణయం పట్ల తనకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని ఆయన తెలిపారు.
ఫిన్గ్రోత్ మీడియా వ్యవస్థాపకుడు కనన్ బహల్ తన కెరీర్ జర్నీని ఎక్స్‌లో ఓ పోస్టు ద్వారా పంచుకున్నారు. విదేశీ ఉద్యోగ ఆఫర్లో పన్ను మినహాయింపు ఉన్న జీతం ఉందని, ఆ సమయంలో ఐసీఏఐ క్యాంపస్ నియామకాల్లో అదే అత్యధిక ఉద్యోగ ప్రతిపాదన అని ఆయన తెలిపారు.
“7 ఏళ్ల క్రితం దుబాయ్‌లో రూ.36 లక్షల ఉద్యోగ ఆఫర్‌ను నేను తిరస్కరించాను. అది పన్ను మినహాయింపు ఉన్న జీతం. ఆ సమయంలో ఐసీఏఐ క్యాంపస్ నియామకాల్లో అదే అత్యధిక ఉద్యోగ ఆఫర్” అని బహల్ తన పోస్టులో రాశారు.
ఖర్చులను లెక్కలోకి తీసుకున్న తర్వాత ఆ ఉద్యోగం తీసుకుని ఉంటే ఏడాదికి దాదాపు రూ.20 లక్షలు ఆదా చేయగలిగేవాడినని ఆయన చెప్పారు. భారత్‌లో పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందని, ఆ సమయంలో ఏడాదికి రూ.12 లక్షలకు మించి జీతం ఇచ్చే ఉద్యోగం తనకు దొరకలేదని తెలిపారు.
అయినా ఎందుకు వద్దన్నారు? జీతంలో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ బహల్ భారత్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. “నేను దాన్ని తిరస్కరించాను. నా కుటుంబానికి, సంస్కృతికి దగ్గరగా ఉండటం నాకు ఎక్కువ ముఖ్యం” అని ఆయన రాశారు.
ఆ నిర్ణయం సరైనదేనని తేలిందని ఆయన తెలిపారు. 7 ఏళ్ల తర్వాత తన పరిస్థితిని గుర్తు చేసుకుంటూ, “ఈ రోజు నాకు ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు” అని పేర్కొన్నారు. భారత్‌లో తాను నిర్మించుకున్న కెరీర్ దుబాయ్ ఉద్యోగం ద్వారా వచ్చేదానికంటే ఎంతో ఎక్కువ లాభదాయకంగా మారిందని తెలిపారు.
అదే పోస్టులో బహల్ జీతంతో పోలికను పక్కనపెట్టి దేశంతో తనకున్న అనుబంధం గురించి, భవిష్యత్తుపై తన నమ్మకం గురించి కూడా మాట్లాడారు. “భారత్ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు. కానీ మనం దాన్ని పరిపూర్ణంగా మార్చాలి” అని రాశారు.
తన కుటుంబ చరిత్ర గురించి కూడా ఆయన ప్రస్తావించారు. 1947లో తమ పూర్వీకులను హింసకు గురై ఇళ్ల నుంచి వెళ్లగొట్టాక తర్వాత భారత్ వారికి ఆశ్రయం ఇచ్చిందని తెలిపారు. “మన స్వాతంత్య్ర సమరయోధులకు, మాతృభూమి భారత్‌కు మనమంతా ఎంతో రుణపడి ఉన్నాం” అని బహల్ చెప్పారు. చివరగా “స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!” అని పేర్కొన్నారు.
యూజర్ల స్పందనలు ఈ పోస్టుకు భారీగా స్పందనలు వచ్చాయి. దుబాయ్ ఉద్యోగ ఆఫర్‌ను పక్కనపెట్టి భారత్‌లోనే ఉండటాన్ని పలువురు ప్రశంసించారు. “చాలా బాగుంది. భారత్ ఎదుగుదలపై నాకు ఎలాంటి సందేహం లేదు. మీలాంటి యువత ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. మీ తల్లిదండ్రులకు కూడా అభినందనలు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి” అని ఓ యూజర్ రాశారు. “గొప్ప పని చేశారు. ఇతరులను కూడా ప్రోత్సహించండి. స్ఫూర్తిదాయకం” అని మరో వ్యక్తి కామెంట్ చేశారు.
ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)
చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)
‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)
దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..?
రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్
సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు
కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?





