
హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్... ఇలా పాత్ర ఏదైనా తనదైన సహజ నటనతో ప్రాణం పోసే విలక్షణ నటుడు శివాజీ . దాదాపు పదమూడేళ్ల విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, వరుస విజయవంతమైన ప్రాజెక్టులతో వెండితెరపై మళ్లీ సందడి చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కష్టకాలంలో ఎదురైన అనుభవాలతో పాటు మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మెగాస్టార్ vs సూపర్ స్టార్... బాక్సాఫీస్ వద్ద చిరంజీవి - రజనీకాంత్ మధ్య ‘డబుల్ క్లాష్’!ఇంటి అద్దె కట్టలేని స్థితిలో చిరంజీవి చేసిన సాయంతాను చిన్నప్పటి నుంచీ మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమానినని శివాజీ తెలిపారు. సినీ జీవితం తొలినాళ్లలో చిరంజీవితో కలిసి 'మాస్టర్' చిత్రంలో నటించే అపురూప అవకాశం తనకు దక్కిందని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ, కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న విషయం చిరంజీవి గారికి తెలియగానే నన్ను దగ్గరకు పిలిచి, నా చేతిలో పదివేల రూపాయల నోట్ల కట్ట పెట్టారు. ఆ రోజు ఆయన చేసిన ఆ సాయం నా మనసును ఎంతగానో కదిలించింది. ఆ సంఘటనే నాలో సేవాభావాన్ని పెంచింది. ఇప్పటికీ ఇతరులకు చేతనైన సాయం చేస్తున్నానంటే దానికి ఆయనే స్ఫూర్తి. ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆయనకు విలన్‌గా నటించాలన్నదే నా జీవితంలో అతిపెద్ద కోరిక" అని శివాజీ తన మనసులోని మాటను బయటపెట్టారు.* ఫస్ట్ డేని మించి సెకండ్ డే కలెక్షన్ల సునామీ... సూర్య కెరీర్లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రేర్ రికార్డ్నరసరావుపేట నుంచి వెండితెర వరకు..నరసరావుపేటలోని ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన శివాజీ, ప్రారంభంలో ఎడిటర్‌గా, యాంకర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు విభాగాల్లో పనిచేశారు. 'శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి' చిత్రంలో స్నేహితుడి పాత్రతో నటన ప్రారంభించి 'శ్రద్ధాంజలి'తో హీరోగా మారారు. నటుడిగా కొనసాగుతూనే పలు సినిమాలకు డబ్బింగ్ చెప్పి ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. తన ఫేవరెట్ హీరోయిన్ భూమికతో కలిసి నటించిన 'మిస్సమ్మ' చిత్రం తన కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని, మళ్లీ ఇన్నాళ్లకు ఆమెతో కలిసి 'ప్రేమకు నమస్కారం' సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు.పిల్లల కోరికతో సెకండ్ ఇన్నింగ్స్.. పదమూడేళ్ల పాటు నటనకు దూరంగా ఉన్నప్పటికీ, కొడుకులు బలవంతం మేరకే రీఎంట్రీ ఇచ్చానని శివాజీ చెప్పుకొచ్చారు. ఈటీవీ విన్లో వచ్చిన '#90's' వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ అదిరిపోగా, 'కోర్టు' చిత్రంలో తాను పోషించిన క్రూరమైన 'మంగపతి' పాత్ర తన జీవితాంతం గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం చేయాలనే ఆలోచనతో గ్రామంలో 30 ఎకరాల భూమి కొనుగోలు చేశానని చెప్పిన శివాజీ, ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.