Movie topic hub

Jailer Collections

Dedicated page for collections updates about Jailer. Crawled stories appear below.

Collections Stories

రజినీకాంత్ జైలర్ 2’లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్?... 40 ఏళ్ల తర్వాత రీ యూనియన్

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన 'జైలర్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.600 కోట్లకు పైగా భారీ గ్రాస్ వసూళ్లు సాధించి, కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు రూ.75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి అగ్ర నటుల అతిథి పాత్రలు సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. దీంతో ఇప్పుడు రూపొందుతున్న సీక్వెల్ ‘ జైలర్ 2 ’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మొదటి భాగం తరహాలోనే ఈ సీక్వెల్‌లో కూడా మరిన్ని క్రేజీ క్యామియోలు ఉంటాయని దర్శకుడు నెల్సన్ ప్రకటించడంతో, ఇందులో ఎవరెవరు నటిస్తున్నారనే ఉత్కంఠ అందరిలోనూ పెరిగింది. * పొల్లాచ్చి షెడ్యూల్‌కు సిద్ధమైన ‘మెగా 158’.. చిరంజీవిపై భారీ యాక్షన్ సీక్వెన్స్! ఈ సినిమాలో ఒక అత్యంత పవర్‌ఫుల్ క్యామియో రోల్ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. నిజానికి ఈ పాత్ర కోసం మొదట నందమూరి బాలకృష్ణను సంప్రదించగా, ఆయన తన బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు ఈ రోల్ ఆఫర్ చేయగా, ఆయన కూడా తన ‘కింగ్’ సినిమా షూటింగ్ కమిట్‌మెంట్స్ వల్ల దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్‌ను కూడా సంప్రదించారనే టాక్ నడిచింది. చివరికి ఈ