
అదుర్స్
Official Trailer & Video Glimpse
HD 1080pDay Wise Collection
Full Collections Report →All Movie Updates & News
నా చంద్రకళ మీదే చెయ్యేస్తార్రా.. రౌడీల్ని ఇరగదీసిన భట్టు.. అదుర్స్’ కథే మార్చేశారు కదరా
ప్రస్తుతం డిజిటల్ ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊపేస్తోంది. కేవలం టెక్నాలజీ రంగాలకే పరిమితం కాకుండా, వినోద పరిశ్రమలో కూడా క్రియేటివీటి రెక్కలు తొడుగుతోంది. టెక్స్ట్ లేదా చిన్న ఫోటో ఇస్తే చాలు.. అద్భుతమైన సినిమాటిక్ వీడియోలను జనరేట్ చేసే స్థాయికి ఏఐ టెక్నాలజీ చేరుకుంది. ఈ క్రమంలోనే నెటిజన్లు, క్రియేటర్లు పాత సినిమాల్లోని ఐకానిక్ సీన్లు, విషాదభరిత క్లైమాక్స్‌లను తమ ఊహకు తగ్గట్టుగా రీ క్రియేట్ చేస్తూ ‘ఆల్టర్నేటివ్ ఎండింగ్స్’ రూపొందిస్తున్నారు. తమకు నచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ సృష్టిస్తున్న ఇలాంటి ఏఐ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.* 70ఏళ్ల వయసులో టీనేజ్ ఎనర్జీ... లేటెస్ట్ ఫోటోషూట్‌తో రచ్చ లేపుతోన్న మెగాస్టార్ చిరంజీవి‘భట్టు’ సరికొత్త యాక్షన్ అవతార్ఈ ఏఐ ట్రెండ్‌లో భాగంగా తాజాగా టాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ ట్రాక్‌పై రూపొందించిన ఒక వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ‘అదుర్స్’ చిత్రంలో అమాయకమైన బ్రాహ్మణుడిగా, వన్ సైడ్ లవర్‌గా కనిపించిన ‘భట్టు’ పాత్రను ఇందులో ఏకంగా ఒక మాస్ యాక్షన్ హీరోగా మార్చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక రెస్టారెంట్లో భట్టు ప్రశాంతంగా కూర్చుని బిర్యానీ తింటూ ఉంటాడు. అదే సమయంలో వెనుక టేబుల్ వద్ద ఉన్న చంద్రకళను కొందరు రౌడీలు వేధిస్తుంటారు. భయంతో వణికిపోయిన ఆమె తనను కాపాడమని భట్టును సహాయం కోరుతుంది. ఇంకేముంది.. తన ప్రియురాలిని ఏడిపిస్తున్నారని తెలియగానే భట్టులోని అసలైన యాక్షన్ హీరో నిద్రలేస్తాడు. రౌద్రరూపం దాల్చి ఆ రౌడీలందరినీ చితక్కొట్టేస్తాడు. ఒక రౌడీని అయితే భట్టు తన కాలితో బలంగా తన్నగా, అతడు రెస్టారెంట్ గ్లాస్ విండోను పగలగొట్టుకుంటూ బయటపడతాడు. భట్టు ధైర్యాన్ని చూసి ముగ్ధురాలైన చంద్రకళ పరుగున వచ్చి భట్టును గట్టిగా కౌగిలించుకుంటుంది. వెంటనే భట్టు ఆమె భుజంపై చేయి వేసి ఎంతో ప్రేమగా "ఆర్ యూ ఓకే చందూ?" అని అడగ్గా, ఆమె మురిసిపోతూ "అవును" అని