
Trigrahi Rajayoga Aug 22 Unexpected Wealth And Fortune For 4 Zodiac Signs 1891047
ఆగస్టు 17న సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు, కేతువు కూడా అప్పటికే అదే రాశిలో ఉంది, అయితే ఆగస్టు 22న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. ఇలా మూడు గ్రహాల కలయిక వలన త్రిగ్రాహి రాజయోగం ఏర్పడనుంది.
ఆగస్టు 17న సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు, కేతువు కూడా అప్పటికే అదే రాశిలో ఉంది, అయితే ఆగస్టు 22న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. ఇలా మూడు గ్రహాల కలయిక వలన త్రిగ్రాహి రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
మేష రాశి : మేష రాశి వారికి ఇది చాలా మంచి సమయం. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఇవి మీకు అత్యధిక లాభాలను తీసుకొస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. చాలా అద్భుతంగా గడుస్తుంది. అనుకున్న పనులు సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు.
సింహ రాశి : సింహరాశి వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పవచ్చును. వీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఈ సమయంలోనే మీకు మీ మిత్రులు,శత్రువులు తెలిసి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
తుల రాశి : తుల రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు ఈ సమయంలో దానిని నెరవేర్చుకుంటారు.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా ఆనందకర జీవితాన్ని గడుపుతారు




