
బ్యాంకులతో ప్రతీఒక్కరికీ అవసరం ఉంటుంది. ఎప్పుడు ఏ అవసరం పడుతుందనేది తెలియదు. రోజువారీ లావాదేవీల కోసం బ్యాంకులతో రోజూ పని ఉంటుంది. దీంతో బ్యాంకు సెలవుల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి.
ఆగస్ట్ 16న ఆదివారం రావడంతో రేపు కూడా బ్యాంకులు ఉండవు. దీంతో వరుసగా రెండు రోజుల పాటు బ్యాంకులు మూతపడుతున్నాయి. అయితే వచ్చే వారంలో కూడా బ్యాంక్ సెలవులు ఉన్నాయి. ఏయే రోజుల్లో మూడపడతాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకోవడం వల్ల ముందే జాగ్రత్త పడవచ్చు.
ఆగస్ట్ 19న మహారాజా బీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జన్మదినోత్సవం సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు మూతపడనున్నాయి. ఆగస్టు 25వ తేదీ మంగళవారం మిలాద్-ఉన్-నబీ / మొదటి ఓనం / మిలాద్-ఇ-షరీఫ్ సందర్భంగా కొచ్చి, తిరువనంతపురం, విజయవాడలో బ్యాంకులు బంద్ కానున్నాయి. దీంతో బ్యాంక్ ఖాతాదారులు దీనిని గమనించాలి.
Found this helpful?
Share this story with your network










