
Axis Bank Credit Card Rules Change From August 28 2026 Know Full Details
Axis Bank Credit Card Rules: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డ్ నిబంధనలలో భారీ మార్పులు ప్రకటించింది.
Axis Bank Credit Card Rules: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డ్ నిబంధనలలో భారీ మార్పులు ప్రకటించింది. ఈ సవరించిన నిబంధనలు ఆగస్టు 28, 2026 నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త రూల్స్ వల్ల విదేశీ లావాదేవీల ఛార్జీలు, ఆలస్య చెల్లింపు రుసుములు, రివార్డ్ పాయింట్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ముఖ్యమైన సేవలపై ప్రభావం పడనుంది. ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు, కొత్త రుసుములు, పాయింట్ల విధి విధానాలు తెలుసుకుందాం.డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ రుసుము పెంపువిదేశాలలో ఉన్నప్పుడు లేదా అంతర్జాతీయ వ్యాపారులకు (POS టెర్మినల్స్, ఆన్లైన్ ద్వారా) భారతీయ రూపాయిలలో చెల్లింపులు చేసినప్పుడు విధించే డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ మార్కప్ ఫీజను యాక్సిస్ బ్యాంక్ పెంచింది. ప్రస్తుతం డీసీసీ ఛార్జీలు 1.5 శాతంగా ఉండగా దానిని 3.5 శాతానికి పెంచారు. మాగ్నస్ కార్డుపై అయితే 2 శాతం, ఒలింపస్ కార్డుపై 1.8 శాతం ఛార్జీలు ఉండనున్నాయి.ఆలస్య చెల్లింపు రుసుము పెంపురూ.50 వేలు అంత కంటే ఎక్కువ బకాయిలు ఉన్న కార్డ్ హోల్డర్లకు కొత్త స్లాబును కేటాయించారు. ఈ పరిమితి దాటితే లేట్ పేమెంట్ ఛార్జీలు రూ.1,300గా నిర్ణయించారు. బకాయి మొత్తం ఆలస్య చెల్లింపు రుసుము (Late Payment Fee) రూ.500 వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు రూ.501 నుంచి రూ.5000 రూ.500 రూ.5001 నుంచి రూ.10,000 రూ.750 రూ.10,001 నుంచి రూ.50,000 రూ.1,200 రూ.50,000 ఆపైన రూ.1,300 బకాయి చెల్లింపు సర్దుబాటుక్రెడిట్ కార్డ్ యూజర్లు బిల్లును పాక్షికంగా (Partial Payment) చెల్లించినప్పుడు, ఆ బ్యాంక్ ఆ సొమ్మును వివిధ కేటగిరీలుగా సర్దుబాటు చేస్తుంది. వర్తించే రుసుములు, ఛార్జీలు (జీఎస్టీతో కలిపి) విధిస్తారు. ఈఎంఐ (EMI)లుగా మార్చడం వడ్డీపైన ఛార్జీలు పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ అడ్వాన్స్ ఏటీఎం విత్ డ్రాయల్స్ రివార్డ్ పాయింట్లు, మైల్ స్టోన్ ఆఫర్లుగిఫ్ట్ కార్డులను వాలెట్ కేటగిరీ నుంచి తొలగించి ప్రత్యేకంగా గిఫ్ట్ కార్డ్ (Gift Card) కేటగిరీ కిందకు మారుస్తున్నారు. వీటిపై ఎలాంటి రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్ లభించవు. అలాగే ఇవి యాన్యువల్ ఫీజు వేవర్లు లేదా మైల్ స్టోన్ ప్రయోజనాల లెక్కలోకి రావు. టోల్ ప్లాజాలు, బ్రిడ్జ్ ఫీజులు, రోడ్డు రుసుముల చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డ్ పాయింట్లు లభించవు.డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్భారతదేశంలోని దేశీయ ఎయిర్పోర్ట్ లాంజ్ లలో ఉచిత ప్రవేశానికి భౌతిక ప్రయారిటీ పాస్ కార్డ్ ఇకపై చెల్లదు. డొమెస్టిక్ లాంజ్ ల కోసం బ్యాంక్ ప్రైమరీ క్రెడిట్ కార్డును మాత్రమే ఉపయోగించాలి. ప్రయారిటీ పాస్ కేవలం ఇంటర్నేషనల్ లాంజ్లకు మాత్రమే పరిమితం చేశారు.






