
10TV Global Footprints : దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎగుమతిదారులు అత్యంత కీలకమని, వారు దేశానికి వెన్నెముకలాంటి వారని ఆయన పేర్కొన్నారు. వెన్నెముక అనేక భాగాలతో బలంగా నిలిచినట్టే.. దేశ ఆర్థిక వ్యవస్థలో రైతులతో పాటు ఎగుమతిదారులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
ఎగుమతులు కేవలం విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడానికే పరిమితం కావని, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు దేశ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని పేర్కొన్నారు.
ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే తెలంగాణ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని, భవిష్యత్‌లో ఇంజినీరింగ్, ఏరోస్పేస్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లోనూ మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునే సామర్థ్యం రాష్ట్రానికి ఉందన్నారు.
Read Also : 10TV Global Footprints : ఐటీ మాత్రమే కాదు.. ఫార్మా, డిఫెన్స్‌లోనూ తెలంగాణ టాప్!
అదేవిధంగా మెడికల్ టూరిజం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లోనూ ఎగుమతిదారులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకుని ఎగుమతులను మరింత పెంచాలని సూచించారు.
తెలంగాణ నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలకు వస్తువులు, సేవలు ఎగుమతి చేయడం ద్వారా ‘బ్రాండ్ తెలంగాణ’తో పాటు ‘బ్రాండ్ ఇండియా’ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని సంపత్ కుమార్ తెలిపారు.
Found this helpful?
Share this story with your network










